'రో-కో రిటైర్మెంట్: వన్డే క్రికెట్‌కు పట్టిన గ్రహణం వీడింది!': మాజీ క్రికెటర్

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం కావడంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే వీరి రిటైర్మెంట్‌పై అభిమానులు కొంత నిరాశలో ఉన్నప్పటికీ.. మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ మాత్రం ఇది వన్డే క్రికెట్‌కు ఓ వరం లాంటిదని అభిప్రాయపడ్డారు.

వన్డే క్రికెట్‌కు కొత్త ఊపిరి!
అద్భుతమైన దేశవాళీ రికార్డు ఉన్న ప్రియాంక్ పంచల్ సోషల్ మీడియా వేదికగా రోహిత్-విరాట్ రిటైర్మెంట్‌పై తన విశ్లేషణను పంచుకున్నారు. "విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం మంచిదైంది. వన్డే క్రికెట్‌కు ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకానొక దశలో 50 ఓవర్ల ఫార్మాట్ కనుమరుగవుతుందేమో అనిపించింది. కానీ భారత్ గర్వించదగ్గ ఇద్దరు మేటి ఆటగాళ్లు ఇప్పుడు కేవలం వన్డేలపైనే దృష్టి పెట్టడం వల్ల ఈ ఫార్మాట్‌కు మళ్లీ కొత్త శక్తి వచ్చింది." అని పంచల్ పేర్కొన్నారు.

Rohit-Kohli ODI Focus Is a Blessing for 50-Over Cricket Says Former Cricketer Priyank Panchal

ఎప్పుడు రిటైర్ అయ్యారు?
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, విరాట్ ఇద్దరూ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ముందు, తమ సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తూ టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా వన్డే ఫార్మాట్‌పై దృష్టి పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు.

వన్డేల్లో పరుగుల సునామీ!
రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరూ వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో 202 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై కూడా రెండు అర్ధసెంచరీలతో రాణించాడు. విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో పాత కోహ్లీని తలపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా వీరిద్దరూ సెంచరీలతో విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+