ఇంత ఎమోషన్ అయ్యావేంటీ..రోహిత్ భాయ్?!
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద.. ప్రతిష్ఠాత్మక ముంబై వాంఖెడే స్టేడియంలో పెవిలియన్ ఏర్పాటైంది. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా దీన్ని నెలకొల్పాయి. జాతీయ జట్టుకు రోహిత్ శర్మ చేసిన సేవలకు గుర్తుగా చిరస్థాయిగా క్రికెట్ చరిత్రలో ఈ పెవిలియన్ నిలిచిపోనుంది.
ఇదివరకు దివేచా పెవిలియన్ లెవల్ 3 స్టాండ్ గా ఇది కొనసాగింది. దీనికి రోహిత్ శర్మ పేరు పెట్టారు. కొద్దిసేపటి కిందటే ఈ స్టాండ్ ను రోహిత్ శర్మ.. తల్లిదండ్రులతో కలిసి ప్రారంభించారు. దీనితో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ ఛైర్మన్ శరద్ పవార్, మాజీ కేప్టెన్ అజిత్ వాడెకర్ పేర్ల మీద ఏర్పాటు చేసిన స్టాండ్స్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ లాంజ్ ను గ్రాండ్ గా ఆవిష్కరించారు.

ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ లాంజ్ కు ఎంసీఏ మాజీ ఛైర్మన్ అమోల్ కాలే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శరద్ పవార్ తో పాటు ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ.. రోహిత్ శర్మకు అభినందనలు తెలియజేశారు.
బోరివలి నుండి వచ్చిన ఓ కుర్రాడు.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో తన పేరును లిఖించుకున్నాడు. శాశ్వత స్థానాన్ని సంపాదించాడు.. అని ఆకాష్ అంబానీ అభినందించారు. తమ జట్టులో ఓ లెజెండర్ ఉండటం గర్వకారణమని చెప్పారు. రోహిత్ ప్రస్థానం ఈ తరం మొత్తానికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు.
ఈ పెవిలియన్ ను ప్రారంభించే సమయంలో డయాస్ పై నుంచి దిగి కిందికి వెళ్లాడు రోహిత్ శర్మ. మొదటి వరుసలో కూర్చున్న తల్లిదండ్రులు, భార్య పిల్లలను స్టేజీ మీదికి పిలుచుకొచ్చాడు. తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ స్టాండ్ ను ప్రారంభించడం అందర్నీ ఆకట్టుకుంది. రోహిత్.. టీ20, టెస్ట్ ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడాడు. భావోద్వేగానికి గురయ్యాడు. తన క్రికెట్ ప్రస్థానం గురించి ప్రస్తావించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ నెల 21వ తేదీన వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్ ఓ అనిర్వచనీయమైన అనుభూతి అవుతుందని చెప్పాడు. తనకు చిరకాలం గుర్తుండిపోతుందని అన్నాడు.
తన పేరు మీద ప్రత్యేకంగా ఓ స్టాండ్ ను నెలకొల్పిన తరువాత వాంఖెడే స్టేడియంలో రోహిత్ శర్మ ఆడబోయే మొట్టమొదటి మ్యాచ్ అదే అవుతుంది. ఐపీఎల్ లోనే కాకుండా జాతీయ జట్టు తరపున వన్డే ఇంటర్నేషనల్స్ ఆడటం కూడా ప్రత్యేకంగా తన జీవితంలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించాడు రోహిత్.
ఇంత మంది ప్రముఖులు- ప్రత్యేకంగా తన తల్లిదండ్రులు, భార్య పిల్లల సమక్షంలో వాంఖెడే స్టేడియంలో తన పేరు మీద ఓ స్టాండ్ ను ఆవిష్కరించుకోవడం గర్వంగా ఉందని చెప్పాడు. తనకు లభించిన అరుదైన గౌరవంగా వ్యాఖ్యానించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తన ఎదుగుదల కోసం త్యాగం చేశారని, వారికి కృతజ్ఞత తెలుపుకొంటున్నానని చెప్పాడు.
#WATCH | Mumbai | At the inauguration ceremony of a stand in Wankhede to be named after him, Indian ODI men's cricket team captain Rohit Sharma says, "It will be a surreal feeling on 21st when I come here and play against Delhi Capitals, representing Mumbai Indians, and to have a… pic.twitter.com/Jw8TflEP0Y
— ANI (@ANI) May 16, 2025
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications