ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..ఆర్సీబీలోకి రోహిత్ ,బుమ్రా ఎంట్రీ..?

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు రంగం సిద్దమవుతోంది. రాబోవు సీజన్‌కు చాలా సమయం ఉన్నా ,ఇప్పటి నుంచే జట్టు యాజమాన్యాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ల విధివిధానాలపై ఐపీఎల్ యాజమాన్యం టీం ఓనర్లతో మీటింగ్‌ నిర్వహించింది. ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ విధివిధానాల గురించి ఈ మీటింగ్‌‌లో ఖరారు చేయడం జరిగింది.

కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం చాలామంది ఆటగాళ్లు తమ టీంను వదిలిపెట్టి, వేరే టీంల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈసారి కెప్టెన్లు సైతం తమ జట్టును వీడేలా ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ జట్టును వీడటం ఖాయమంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన రూల్స్‌ను బట్టి చూస్తే ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌‌లో భాగంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌‌ను వీడి ఆర్సీబీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

Rohit Sharma and justin bumrah move to RCB for IPL 2025

ఒకవేళ అందురు అనుకున్నట్టు రోహిత్ ముంబై ఇండియన్స్‌‌కు గుడ్ బై చెబితే..అతని కోసం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ టీంలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ యాజమాన్యం రోహిత్ కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా రెడీ ఉన్నట్టు కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు నుండి రోహిత్ శర్మను ఆర్సీబీ జట్టులోకి తీసుకుని అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనేది ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఉద్దేశం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబై ఇండియాన్స్ స్టార్ బౌలర్ బుమ్రా సైతం జట్టును వీడటానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి వెళ్లబోతున్నట్లు న్యూస్ వైరల్‌గా మారింది.

హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన దగ్గర నుంచి అతడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు చోటు చేసుకోవడంతో బుమ్రా ముంబైని వీడటానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బుమ్రా ముంబైను వీడి ఆర్సీబీలోకి వస్తాడని జోరుగా చర్చనడుస్తోంది. అటు ఆర్సీబీ సైతం బుమ్రాను తీసుకోవడానికి సిద్దంగా ఉంది. ఆ జట్టుకు స్టార్ బౌలర్ కొరత ఎప్పటి నుంచో వెంటాడుతోంది. అవసరం అయితే ట్రేడింగ్ విండో ద్వారా బుమ్రాను జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రా ముంబై టీమ్ లోనే ఉంటాడా? లేదా ఆర్సీబీలోకి వెళ్తాడా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+