రోహిత్‌ శర్మకు ఆ సర్జరీ జరగకపోతే కెరీర్ ముగిసేదా?

39 ఏళ్ల వయసులో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై తరచూ రకరకాల ప్రశ్నలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఆయన స్టేడియంలో బద్ధకంగా ఉంటారని లేదా ఫిట్‌గా లేరని చాలా మంది విమర్శిస్తుంటారు. అయితే టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఓ పాడ్‌కాస్ట్‌లో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు సంబంధించి అనేక ఆసక్తికరమైన, దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు. ఈ నిజాలు వింటే విమర్శకుల నోళ్లు మూతపడటం ఖాయం.

జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ!
జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ!

ఆ పాడ్‌కాస్ట్‌లో సోహమ్ దేశాయ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ స్డేడియం కష్టపడరని లేదా ఫిట్‌నెస్ ట్రైనింగ్ నుంచి తప్పించుకుంటారనే వార్తలను పూర్తిగా ఖండించారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో రోహిత్ శర్మ తొంటి వద్ద తీవ్రంగా గాయమైన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ గాయం రోహిత్ శర్మ కెరీర్‌కే పెద్ద ముప్పుగా మారింది. ఒకవేళ సరైన సమయంలో ఆయనకు సర్జరీ జరగకపోయి ఉంటే ఆయన క్రికెట్ కెరీర్ అక్కడితోనే ముగిసిపోయేది.

Rohit Sharma Fitness Former Coach Soham Desai Reveals 2017 Surgery Saved His Career and responds to critics

ఆ విషయాలను మరింత వివరిస్తూ.. "రోహిత్ శర్మ బద్ధకస్తుడని, లావుగా ఉంటాడని, సరిగ్గా శిక్షణ తీసుకోడని విమర్శకులు అంటారు. కానీ 2017లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో ఆయనకు ఎంత ప్రమాదకరమైన గాయం అయిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ గాయం తర్వాత ఆయనకు హ్యామ్‌స్ట్రింగ్, హిప్ ఫ్లెక్చర్ సర్జరీ జరిగింది. ఆ సంఘటన తర్వాత ఆయన తొంటి భాగం అత్యంత బలహీనమైన, సున్నితమైన ప్రాంతంగా మారింది. అందుకే రోహిత్ వారానికి కనీసం రెండు సార్లు ప్రత్యేకంగా స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటారు" అన సోహమ్ దేశాయ్ వెల్లడించారు.

ఇషాన్ కిషన్ అవుట్- వైభవ్ సూర్యవంశీకి సెకెండ్ ఛాన్స్.. !!
ఇషాన్ కిషన్ అవుట్- వైభవ్ సూర్యవంశీకి సెకెండ్ ఛాన్స్.. !!

రోహిత్- విరాట్ శరీర తత్వాల మధ్య తేడా ఏంటి?
గత 7-8 ఏళ్లుగా రోహిత్ శర్మకు ఈ స్పెషల్ ట్రైనింగ్ రొటీన్ అత్యంత కీలకమైనదని మాజీ కోచ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన తన ఫిట్‌నెస్‌పై ఇంత తీవ్రంగా కష్టపడకపోయి ఉంటే ఐపీఎల్‌లో ఎక్కువ కాలం కెప్టెన్సీ చేయడం, ఏడాది పొడవునా వరుసగా మ్యాచ్‌లు ఆడటం, మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారించడం ఆయనకు అస్సలు సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫిట్‌నెస్ విధానాలను పోలుస్తూ సోహమ్ దేశాయ్ మాట్లాడారు. వారిద్దరి శారీరక అవసరాలు పూర్తిగా భిన్నమైనవని వివరించారు. విరాట్ కోహ్లీకి స్టేడియంలో ఎక్కువగా పరిగెత్తాల్సిన అవసరం ఉంటుందని కాబట్టి ఆయన బేసిక్ స్ట్రెంత్ వర్క్ పై దృష్టి పెడతారని చెప్పారు. కానీ రోహిత్ శర్మ గతంలోని గాయాల కారణంగా.. హిట్ మ్యాన్ బాడీ పూర్తిగా ప్రత్యేకమైన స్ట్రెంత్ వర్క్, రన్నింగ్ రొటీన్‌పై ఆధారపడి ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+