రోహిత్ శర్మ అవుట్- కనీసం..?!
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్ ను 18 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అర్ధసెంచరీలతో చెలరేగారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు.
అనంతరం ఛేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పోరాట పటిమ ప్రదర్శించింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్ లో ఆల్ రౌండర్ షెర్ఫానె రూథర్ ఫర్డ్ ఇన్నింగ్ హైలైట్. తడాఖా చూపించాడు. ఆర్సీబీకి చెమటలు పట్టించాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో 9 భారీ సిక్సర్లు, ఒక బౌండరీతో 71 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీతో అతను బాధపడుతున్నాడు. అతని ఫిట్‌నెస్‌పై ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 241 పరుగులను అందుకునే క్రమంలో, రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్ ముంబైకి పవర్‌ప్లేలో 62/0తో శుభారంభాన్నిచ్చారు గానీ ఆ తర్వాత ఇబ్బంది పడాల్సొచ్చింది. ఆరో ఓవర్‌లో హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో రోహిత్ శర్మ (13 బంతుల్లో 19 పరుగులు) రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మళ్లీ క్రీజులోకి రాలేదు.
మ్యాచ్ అనంతరం షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ మీడియాతో మాట్లాడతూ రోహిత్ శర్మకు హ్యామ్‌స్ట్రింగ్ సమస్య ఉందని నిర్ధారించాడు. దీనిపై ఎక్కువ సమాచారం ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. గాయం తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. దాని తీవ్రతను తెలుసుకోవడానికి రోహిత్‌కు స్కాన్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఫిజియోథెరపిస్ట్ మైదానంలోనే అతనికి చికిత్స అందించాడు గానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు.
రోహిత్ గాయంపై ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ నుండి ఎటువంటి అధికారికంగా రాలేదు. అయినప్పటికీ కనీసం ఒకట్రెండు మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. 16వ తేదీన వాంఖెడేలో పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల తీవ్రతను బట్టి చూస్తోంటే ఈలోగా రోహిత్ శర్మ కోలుకోలేకపోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications