రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..క్రికెట్‌కు గుడ్ బై..?
రోహిత్ శర్మ, భారతీయ క్రికెట్ జట్టుకు ఒక అమూల్యమైన ఆస్తి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రోహిత్ శర్మ, భారతీయ క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును అనేక విజయాలకు నడిపించాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అనేక ఐపీఎల్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2016 టీ20 ప్రపంచకప్‌లలో భారత జట్టును విజయం వైపు నడిపించాడు. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాడు.అయితే టెస్ట్ క్రికెట్‌పై మాత్రం రోహిత్ శర్మ తన ముద్ర వేయలేకపోయాడు.తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో సైతం రోహిత్ శర్మ తడబడుతున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ బ్యాటింగ్ సగటు 6.20 ఉంది. క్రీజులో నిలదొక్కుకోవడానికే రోహిత్ శర్మ ఇబ్బందిపడ్డాడు.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్ట్ మ్యాచులను ఆడుతోంది. రోహిత్ శర్మ దూరం కావడంతో మొదటి టెస్ట్ మ్యాచ్‌కు స్టార్ బౌలర్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాడు. మొదటిసారే కెప్టెన్సీ చెప్పట్టినప్పటికీ , కెప్టెన్‌గా జట్టుకు విజయాన్ని అందించాడు.

తర్వాత రోహిత్ రావడంతో అతను తిరిగి పగ్గాలు చేపట్టాడు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం సాయంతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్న రోహిత్ సేన, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా రెండింటిల్లోనూ రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. దీంతో అతను రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. జనవరి 3న సిడ్నీ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు కొనసాగితే.. జనవరి 7వ తేదీ రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌కు చివరి రోజు కావచ్చనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.












Click it and Unblock the Notifications