IND Vs AUS: గెలుపుకు ఆ నలుగురే అడ్డు - రోహిత్ విన్నింగ్ మంత్ర..!!
ప్రపంచ కప్ ఫైనల్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సొంత గడ్డ పైన విశ్వ విజేతగా టీమిండియా నిలవాలని కోట్లాది ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్ల నిలకడ అమోఘం. బౌలర్ల మెరుపులు అద్భుతం. ఫైనల్స్ లో టీమిండియా తల పడుతున్న ఆసీసీ బలమైన ప్రత్యర్ధే. ఈ ఫైనల్ గెలవాలంటే ఆసీస్ టీంలో ప్రధానంగా ఆ నలుగురే సమస్యగా మారనున్నారు. వీరి పైన రోహిత్ కొత్త ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఫైనల్ విన్నింగ్ మంత్ర సిద్దం చేసుకున్నారు.
తుది సమరం: 2023 ప్రపంచ కప్ తుది సమరానికి రంగం సిద్దమైంది. మూడో సారి ప్రపంచ కప్ గెలిచే అవకాశం వదులుకోకూడదని రోహిత్ టీం బలమైన సంకల్పంతో ఉంది. అదే సమయంలో తమ సత్తా కొనసాగించాలని ఆసీస్ పట్టుదలతో కనిపిస్తోంది. ఓడిపోయే మ్యాచ్ లను సైతం తమకు అనుకూలంగా మలచుకోవటంలో ఆసీస్ టీం ప్రత్యేకత చాటుకుంటుంది.

ఆసీస్ తో ఫైనల్స్ ఒత్తిడిని జయిస్తూ విన్నర్ గా నిలవటం అంత ఆషా మాషీ కాదు. కానీ, వీటన్నింటికీ అతీతం అన్నట్లుగా టీం ఇండియా కనిపిస్తోంది. ఈ టోర్నీలో చెన్నైలో భారత్ తొలి మ్యాచ్ ఆసీస్ తో ఆడింది. ఆ మ్యాచ్ లో భారత ఓపెనర్లు ఆసీస్ బౌలర్ల ధాటికి త్వరగా పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ లో ప్రధానంగా నలుగురితో టీం ఇండియాకు ముప్పు పొంచి ఉంది.
రోహిత్ కొత్త ప్లాన్స్: ఆసీస్ లోని ఆ నలుగురిని కట్టడికి రోహిత్ కొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నారు. ఆసీస్ ఓపెనర్ హెడ్ అటు బంతితో..ఇటు బ్యాట్ తోనూ రెచ్చిపోతున్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో మెరుపు సెంచరీతో భారత్ కు టైటిల్ దూరం చేసాడు. క్రీజులో కుదురుకుంటే ఆపటం కష్టం. అతడి ఆఫ్ స్పిన్ తోనూ ప్రమాదమే.

దీంతో, హెడ్ ను పైన భారత్ పేస్ త్రయం సిద్దం అవుతోంది. ఇక, బౌలర్ స్టార్క్. భారత బ్యాటర్లకు ఆరంభంలో స్టార్క్ ను ఎదుర్కోవటం పెద్ద సవాల్. రోహిత్ శర్మను స్టార్క్ లక్ష్యం చేసుకుంటాడనటంలో సందేహం లేదు. తొలి స్పెల్ లో స్టార్క్ ను సమర్ధంగా ఎదుర్కొంటే భారత్ కు బ్యాటింగ్ లో అతి పెద్ద ముప్పు తొలిగినట్లే. ఈ బాధ్యత రోహిత్ - గిల్ భుజస్కందాలపైనే ఉంది.
కట్టడి చేస్తే గెలుపు ఖాయం: ఇక, మరో ఆసీస్ ఆల్ రౌండర్ మ్యక్స్ వెల్. ఆఫ్టన్ తో మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫైనల్ లో మ్యాక్స్ వెల్ పైన రోహిత్ ప్రత్యేకంగా గేమ్ ప్లాన్ సిద్దం చేసుకున్నాడు. స్పిన్ ఆడటంలో మ్యాక్స్ కు ఉన్న బలహీనతలకు అనుకూలంగా మలచుకొనేందుకు రోహిత్ సిద్దం అవుతున్నాడు. మ్యాక్స్ వెల్ ను త్వరగా పెవిలియన్ కు పంపకుంటే మ్యాచ్ ఫలితమే తారు మారు చేసే సత్తా ఉన్న ఆటగాడు.

ఇక, ఆసీస్ కు ఉన్న ఏకైక స్పిన్నర్ జంపా. టోర్నీలోనే జంపా అత్యుత్తమ స్పిన్నర్ 22 వికెట్లను తీశాడు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లు అనుకూలం కావటంతో భారత బ్యాటర్లు జాగ్రత్త అవసరం. ఈ నలుగురి కోసం రోహిత్ స్పెషల్ స్కెచ్ అమలు చేయటానికి భారీ కసరత్త చేసాడు. మరి..ఈ గ్రాండ్ ఫినాలే లో రోహిత్ వ్యూహాలే జట్టను విశ్వ విజేతగా నిలబెట్టాలి.













Click it and Unblock the Notifications