Ind-NZ T20I: నీ ఒక్కడి వల్ల అంతా..! సూర్యకు రోహిత్ వార్నింగ్..!
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య ఇవాళ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టు కివీస్ తో హోరాహోరీ తలపడేందుకు సిద్ధమవుతోంది. అసలే కివీస్ తో వన్డే సిరీస్ ను కోల్పోయిన బాధలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ అయినా నెగ్గి పరువు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ పైనా అందరి దృష్టీ నెలకొంది.
ఇలాంటి తరుణంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై అతని ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు సహచరుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కూడా అయిన రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని ప్రశంసిస్తూనే.. అతని బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ కీలక హెచ్చరికలు చేశాడు. కివీస్ తో టీ20 సిరీస్ ప్రారంభమవుతున్న వేళ రోహిత్ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది..

కెప్టెన్ ఫామ్‌లోకి వస్తున్నాడా లేదా అనేది ముఖ్యం కాదని, ఒక ఆటగాడు ఫామ్‌లో లేకుంటే. మన దగ్గర ఉన్న ఏడుగురు లేదా ఎనిమిది మంది బ్యాటర్లలో, మనకు ఒక బ్యాటర్ తగ్గుతున్నాడంటూ సూర్య కుమార్ వైఫల్యాలపై రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. మనకు ఉన్న ప్రధాన శక్తి బ్యాటింగ్.. ఇందులో మీరు ఒకరిని వదిలివేస్తే, అది ఉండాల్సినంత ప్రభావవంతంగా ఉండదన్నాడు సూర్య బాగా ఆడకపోతే, బ్యాటింగ్ లైనప్ దెబ్బతింటుందని స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఆట గురించి, అతనితో ఆడుతున్న ఆటగాళ్ల గురించి, వారి నుండి ఉత్తమ ప్రదర్శన పొందాలో సూర్యకు చాలా అవగాహన ఉందని తాను భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. తద్వారా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఎలాంటి ఇబ్బందీ లేదని, కేవలం బ్యాటింగ్ ను సరి చేసుకుంటే జట్టును విజయాల బాట పట్టించవచ్చని మూడు ఫార్మాట్లలోనూ అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ చెప్పకనే చెపినట్లయింది.












Click it and Unblock the Notifications