హాయిగా నిద్రపోయాడు- మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డ్ పట్టాడు

Jofra Archer: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని అందుకుంది. తొలి రెండింట్లో ఘోరంగా ఓడిన ఈ జట్టు.. చివరి రెండింట్లో జయకేతనం ఎగురవేసింది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.

శనివారం రాత్రి ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది రాజస్థాన్ రాయల్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరగులు చేసిందీ పింక్ టీమ్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది.

RR vs PBKS Jofra Archer was sleeping a few minutes ago and then he got ready to bat in IPL 2025

రాజస్థాన్ ఇన్నింగ్‌లో టాప్ స్కోరర్ యశస్వి జైస్వాల్. తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగాడీ లెఫ్ హ్యాండ్ ఓపెనర్. 45 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్- 38, రియాన్ పరాగ్- 43, షిమ్రోన్ హెట్మెయిర్- 20 పరుగులతో రాణించారు.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్‌లో నేహాల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మినహా మరెవరూ రాణించలేకపోయారు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా గోల్డెన్ డక్ సాధించాడు. ఇన్నింగ్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోఫ్రా అర్చర్ వేసిన ఓవర్ అది. 144 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ డెలివరీని అంచనా వేయలేకపోయాడు ప్రియాన్ష్. లెగ్ స్టంప్ మీద పిచ్ అయి షార్ప్ టర్న్ తీసుకుని వికెట్లను ఎగురగొట్టింది.

అదే ఓవర్ చివరి బంతికి కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు జోఫ్రా. 148 కిలోమీటర్ల వేగంతో మిస్సైల్‌లా వికెట్ల మీదికి వచ్చిన జోఫ్రా డెలివరీని భారీ షాట్ ఆడబోయాడు గానీ సాధ్యపడలేదు. ఆఫ్, లెగ్ స్టంప్స్‌ను గాల్లోకి ఎగరేసిందా బంతి. దీనితో 11 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పంజాబ్. మిడిలార్డర్‌లో వధేరా- 62, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 30 ఆదుకున్నారే గానీ జట్టును గెలిపించలేకపోయారు. వారిద్దరూ అవుట్ అయ్యాక వికెట్లు నేలకూలాయి.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో హాయిగా కునుకు తీశాడు జోఫ్రా. దాదాపుగా 25 నిమిషాల పాటు నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెట్మెయిర్ అవుట్ అయ్యేంత వరకు నిద్రపోతూనే కనిపించాడు. ఆ తరువాత తన వంతు రావొచ్చనే ఉద్దేశంతో ప్యాడ్స్ కట్టుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+