విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్..హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి..ఇప్పుడేమో
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.తాజాగా సినిమా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది టీమిండియా క్రికెటర్లు , తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో పయనిస్తున్నారు.టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్నారు.తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు. మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. సెహ్వాగ్ దాదాపు విడాకులు తీసుకున్నట్టే అని తెలుస్తోంది.

తాజాగా మరో టీమిండియా క్రికెటర్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.మనిష్ పాండే విడాకుల బాట పట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.మనిష్ పాండే కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆశ్రిత శెట్టిని ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నాడు. అయితే ఆశ్రితా శెట్టి, మనీష్ పాండేకి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ జంట కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో పాటు, పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోవడం ఖాయమంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్ళి ఫోటోలను తొలగించడమే. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. విడాకులకు సంబంధించి కోర్టులో విచారణ సాగుతుందని, తుది తీర్పు వెలువడగానే తమ విడాకుల గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications