జాతీయ జట్టులో సనత్ జయసూర్యకు కీలక పదవి

Sanath Jayasuriya: ఊహించినట్టే- శ్రీలంకకు చెందిన మాజీ ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య కీలక పదవి లభించింది. ఆ దేశ జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చిందని వెల్లడించింది.

రెండు సంవత్సరాల పాటు సనత్ జయసూర్య ఈ పదవిలో కొనసాగుతారు. 2026 మార్చి 31వ తేదీ వరకు ఆయన జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆ తరువాత జట్టు ప్రదర్శన ఆధారంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించాలా? వద్దా? అనేది బోర్డు నిర్ణయిస్తుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ పూర్తయ్యేంత వరకూ ఇదే హోదాలో ఉంటారు.

Sanath Jayasuriya has been appointed as the Head coach of the Sri Lankan cricket team

ప్రస్తుత సనత్ జయసూర్య.. శ్రీలంక జాతీయ జట్టుకు తాత్కాలికంగా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఏడాది జూలైలో ఆయన అపాయింట్ అయ్యారు. హెడ్ కోచ్‌గా జయసూర్య సారథ్యంలో కొన్ని అద్భుతాలను సృష్టించింది శ్రీలంక క్రికెట్ టీమ్.

తమ దేశ పర్యటనకు వచ్చిన భారత జట్టును వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఓడించింది. 27 సంవత్సరాల తరువాత సిరీస్‌ను సొంతం చేసుకుంది. టెస్ట్ ఫార్మట్‌లో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. అదే జైత్రయాత్రను న్యూజిలాండ్‌పైనా కొనసాగించింది. కివీస్‌ను 2-0 తేడాతో ఓడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి మరింత చేరువ అయింది.

జట్టు పెర్‌ఫార్మెన్స్‌ అనుకున్న దాని కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్.. తాజా నిర్ణయాన్ని తీసుకుంది. పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్యను అపాయింట్ చేసింది. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్‌ను ఎదుర్కొనబోతోంది శ్రీలంక. డంబుల్లా, పల్లెకెలెల్లో మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనుంది.

ఈ నెల 13వ తేదీన శ్రీలంక- వెస్టిండీస్ మధ్య తొలి టీ20 డంబుల్లాలో మొదలవుతుంది. 15, 17 తేదీల్లో జరిగే మ్యాచ్‌లతో ఈ సిరీస్ ముగుస్తుంది. 20వ తేదీన తొలి వన్డే పల్లెకెలెలో షెడ్యూల్ అయింది. 23, 26 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్- సనత్ జయసూర్య మొదటి టాస్క్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+