సంజూకు పొంచి ఉన్న ముప్పు - సెమీస్ లో గంభీర్ ప్లాన్ ఛేంజ్..!!

India Vs England semi final T20 world Cup: టీ20 ప్రపంచ కప్ లో అసలు సిసలు సమరం మొదలైంది. భారీ అంచనాల తో టీమిండియా సెమీస్ లో అడుగు పెట్టింది. ఈ రోజు జరిగే తొలి సెమీస్ లో కివీస్ - సఫారీ టీం ల మధ్య మ్యాచ్ పైన ఆసక్తి నెలకొంది. ఇక.. ఇంగ్లాండ్ జట్టు అన్ని రంగాల్లో బలంగా ఉంది. పూర్తి ఫాంలో ఉన్న ఆటగాళ్ల పైన టీమిండియా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. విండీస్ మ్యాచ్ హీరో సంజూ శాంసన్ కు సెమీస్ లో ఆ ఇద్దరితో ముప్పు పొంచి ఉంది. దీంతో.. ఇప్పుడు ఏం జరగబోతుందనే ఉత్కంఠ పెరుగుతోంది.

టీ20 ప్రపంచ కప్ లో తొలి సెమీస్ ఈ రోజు కోల్ కతా లో కివీస్ - దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు హోరా హోరీ పోరు తప్పేలా లేదు. భారీ స్కోర్లు నమోదు కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, రేపు ( గురువారం) ముంబాయిలో జరిగే రెండో సెమీస్ కోసం టీం ఇండియా సమాయత్తం అవుతోంది. వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజు పైన అంచనాలు పెరుగుతున్నాయి.

Sanju Samson prepared differently to outsmart Jofra Archer s threat for the 1st semi final between India and England

అయితే, అదే సమయంలో ఇంగ్లాండ్ నుంచి సంజూకు ఇద్దరు బౌలర్లతో ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లాండ్ కీలక బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లీష్ పేసర్‌ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు. శాంసన్‌కు జోఫ్రా 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే సాధించాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో సంజు మూడు సార్లు అవుటయ్యాడు. ఒకవేళ ఇంగ్లండ్ ఆర్చర్‌తోనే బౌలింగ్ ఆరంభిస్తే.. ఓపెనర్‌గా సంజు ఆచి తూచి ఆడాల్సి ఉంటుంది. సంజూతో పాటుగా అభిషేక్ పైన ఇంగ్లాండ్ టీం గురి పెట్టింది.

అదే విధంగా జోఫ్రాతో పాటు మరో బౌలర్ సామ్‌ కరన్‌ కూడా సంజుకు సవాల్ గా నిలవనున్నాడు. టీ20 మ్యాచుల్లో సామ్‌ కరణ్ సంజుకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజు...భారత జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగలడు. ఈ ఇద్దరి బౌలర్లతో సంజుకు ఉన్న గత గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే..అభిషేక్ తో పాటుగా సంజూను ఓపెనింగ్ జోడీగా పంపిస్తారా.. ప్లేస్ మెంట్ మారుస్తారా అనేది సందేహంగా మారుతోంది.

అయితే, సంజుపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. కుడి - ఎడమ కాంబినేషన్ ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. అటు ఇంగ్లాండ్ సైతం ప్రధానంగా సంజూతో పాటుగా అభిషేక్, ఇషాన్ కిషన్ పైన ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ ముగ్గురిని కట్టడి చేస్తే తమకు ఇక సమస్య ఉండదనే లెక్కలు వేస్తోంది. దీనికి కౌంటర్ గా అటు కోచ్ గంభీర్ సైతం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అటు .. వెస్టిండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌.. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ కు సిద్దమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+