ఆర్సీబీ నెత్తిన పాలు పోసిన ధోనీ సేన- రసవత్తరంగా ప్లేఆఫ్స్
CSK vs GT: ఐపీఎల్ 2025 లీగ్స్ దశ ముగుస్తున్న కొద్దీ.. ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్నాయి. రంజుగా తయారయ్యాయి. ప్లేఆఫ్స్ లో పోటీ పడే జట్లేమిటనేది ఇప్పటికే ఖరారైనప్పటికీ- క్వాలిఫయర్స్ ఎవరిది ఏ స్థానం అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారుతూ వస్తోంది.
దీనికి కారణాలు లేకపోలేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్.. వరుసగా ఓటములు చవి చూస్తోండటమే దీనికి కారణం. ఇప్పుడు తాజాగా గుజరాత్ టైటాన్స్ మరో మ్యాచ్ లో దారుణంగా ఓడింది. ప్లేఆఫ్స్ బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్న తరువాత రెండో ఓటమి ఇది.

ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ- అది కిందికి దిగిపోవడానికి ఎంతో సమయం పట్టదు. గుజరాత్ టైటాన్స్ పొజీషన్ ఎలా ఉండబోతోందనేది- లీగ్స్ లో ఇంకా చివరి మ్యాచ్ లు ఆడబోతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ గెలుపోటముల మీద ఆధారపడి ఉంది.
తాజాగా- అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 83 పరుగుల తేడాతో మట్టికరిచింది గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. తన సొంత గడ్డపై ఈ జట్టును కొట్టలేకపోయింది గుజరాత్ టీమ్. 18.3 ఓవర్లల్లో 147 పరుగులకు కుప్పకూలింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్ లో డెవాల్డ్ బ్రేవిస్ మెరుపు బ్యాటింగ్ హైలైట్. 23 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 57 పరుగులు బాదాడీ బేబీ ఏబీడీ. గుర్జప్ నీత్ సింగ్ గాయపడటం వల్ల అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు డెవాల్డ్. తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ లల్లో 218 పరుగులు చేశాడు. 42, 32, 0, 53, 42, 57.. పరుగులు కొట్టాడు.
బ్రెవిస్ తరువాత డెవాన్ కాన్వే చెప్పుకోదగ్గ ఇన్నింగ్ ఆడాడు. 35 బంతుల్లో 52 పరుగులు బాదాడు. ఆయుష్ మాత్రే, ఉర్వి పటేల్ మెరుపు ఇన్నింగ్.. సీఎస్కే భారీ స్కోర్ కు దారి తీసింది. అనంతరం ఛేజింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఎక్కడే గానీ దూకుడుగా ఆడలేకపోయింది. భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమైంది.
సాయి సుదర్శన్- 41, శుభ్ మన్ గిల్- 13, జోస్ బట్లర్- 5, షెర్ఫానె రూథర్ ఫర్డ్- 0, ఎం షారుఖ్ ఖాన్- 19, రాహుల్ తెవాతియా- 12, రషీద్ ఖాన్- 5, అర్షద్ ఖాన్- 20, సాయి కిశోర్- 3, మహ్మద్ సిరాజ్ - 3 (నాటౌట్) పరుగులు చేశారు. 147 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. 83 పరుగుల తేడాతో ఓడింది.
గుజరాత్ టైటాన్స్ చవి చూసిన ఈ ఓటమి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టాప్ 2లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టయింది. పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 1ను ఢీ కొడుతుంది. ఈ మ్యాచ్ సోమవారం సాయంత్రం జరుగనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ గనక గెలిచితే ఆ జట్టు క్వాలిఫయర్ 1కు చేరుకుంటుంది. ఆర్సీబీ గనక ఓడిపోతే గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 1లో అడుగు పెడుతుంది. క్వాలిఫయర్ 1కు చేరాలా? వద్దా? అనేది ఆర్సీబీ చేతుల్లోనే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి తీరాల్సి ఉంటుంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications