T20 World cup: బంగ్లాదేశ్ స్థానంలో కొత్త టీం ఎంట్రీ - బీసీబీకి కోలుకోలేని దెబ్బ..!!
T20 World cup: టీ20 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్.. పాక్ నిర్ణయాలు వివాదాలుగా మారుతున్నాయి. కాగా.. అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ఐసీసీ సీరియస్ గా తీసుకుంది. బంగ్లా నిర్ణయంలో మార్పు రాకుంటే మరో జట్టు ఎంట్రీకి సిద్దంగా ఉంది. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. కాగా, బంగ్లాదేశ్ ఈ నిర్ణయంతో ఆర్దికంగా భారీ నష్టం ఎదుర్కోనుంది.
టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి సర్వం సిద్దం అవుతోంది. ఈ సమయంలోనే బంగ్లాదేశ్ తాము భారత్ లో ఆడబోమని ప్రకటించింది. ఐసీసీ ముందు కొత్త ప్రతిపాదనలు చేసింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. దీంతో ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఐసీసీ తమపై చేస్తున్న ఒత్తిడికి తలొగ్గేది లేదని బీసీబీ ఇప్పటికే చెప్పింది. దీంతో.. ప్రకటించినట్లుగానే ఈ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే బోర్డుకు అర్థికంగా భారీ నష్టం తప్పదు.

దాదాపుగా రూ 240 కోట్ల మేర బంగ్లా క్రికెట్ బోర్డు నష్టపోనుంది. అదే విధంగా బ్రాడ్‌కాస్ట్, స్పాన్సర్‌షిప్ రూపంలో రావాల్సిన ఆదాయంలో 60 శాతం కోల్పోనుంది. టీ20 ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలను బహిష్కరిస్తే స్పాన్సర్లు దూరం అవుతారనే ఆందోళన కనిపిస్తోంది. బంగ్లాదేశ్ తాజా నిర్ణయంతో ఈ ఏడాది జరిగే భారత్ సిరీస్ సైతం రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాగా, బంగ్లాదేశ్ క్రికెటర్లకు మాత్రం భారత్ లో ఆడాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తదుపరి పరిణామాల పైన మౌనంగానే ఉంటున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ క్రికెట్ పైన ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక.. బంగ్లాదేశ్ అధికారికంగా తాము టీ20 ప్రపంచ కప్ కు దూరం అవుతున్నట్లుగా ప్రకటిస్తే ఐసీసీ మరో నిర్ణయానికి సిద్దంగా ఉంది. ఈ రాత్రి లోగా బంగ్లాదేశ్ తమ నిర్ణయాన్ని ఐసీసీకి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
బంగ్లాదేశ్ నిర్ణయం మారకుంటే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ టీ20 ప్రపంచ కప్ లో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, దీని పైన ఇప్పటి వరకు అటు ఐసీసీ.. స్కాట్లాండ్ టీం మేనేజ్ మెంట్ గోప్యత పాటిస్తున్నారు. బంగ్లాదేశ్ అధికారిక నిర్ణయం వెలువడిన తరువాత ప్రకటన చేసే ఆలోచనతో ఉన్నారు. కాగా.. బంగ్లాదేశ్ నిర్ణయం మారకుంటే.. క్రికెట్ ఆట లో భవిష్యత్... ఆర్దికంగానూ భారీ నష్టం తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications