దుబాయ్ మ్యాచ్ లో గెలుపు వారిదే - ఆఫ్రిది..!!

India Vs Pakistan: దాయాదుల సమరంలో గెలుపెవరిది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ టీంలో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. అదే విధంగా పాకిస్థాన్ టీం సైతం దూకుడు మీద ఉంది. భారత్ ఓపెనర్లు మంచి ఫాంలో ఉన్నారు. ఇరు జట్లకు ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కావటంతో గెలుపు ఎవరికి దక్కుతుందనే అంచనాలు భారీగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తన అంచనాలను వెల్లడించారు. గెలుపు అవకాశాలు ఎవరివో తేల్చేసారు.

గెలుపెవరిది
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాక్ మ్యాచ్ పైన సీనియర్ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడి స్తున్నారు. ఈ మ్యాచ్ పైన జ్యోతిష్కులు సైతం రంగంలోకి దిగారు. కొందరు భారత్ వైపు.. మరి కొందరు పాకిస్థాన్ కు మద్దతుగా అంచనాలు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్​ఇండియా బలాలు - బలహీనతల గురించి వివరించారు. పాక్ తో పోలిస్తే రోహిత్ టీంలో ఎక్కువ మంచి మ్యాచ్ విన్నర్లు ఉన్నారని.. వీరితో ఎటువంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ వారి వైపు తిరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.

Shahid Afridi predicts the results of India vs Pakistan Champions trophy match at Dubai

క్రికెట్ ఫీవర్
పాకిస్థాన్​తో పోలిస్తే భారత్​లో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని ఆఫ్రిది పేర్కొన్నారు. అసలు ప్రస్తుతం పాకిస్థాన్ టీంలో మ్యాచ్ విన్నర్లు లేరని చెప్పారు. టీమ్​ఇండియా బలం మిడిల్, లోయర్ బ్యాటర్లుగా పేర్కొన్నారు. అందుకే భారత్ మ్యాచ్ లను గెలుస్తోందని వివరించారు. చాలా కాలంగా పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నా, ఎవరూ రాణించటం లేదేన్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసే వారు నిర్దేశించే లక్ష్యం పైన ఫలితం ఆధారపడి ఉంటుందని వివరించారు. అదే విధంగా టీం ఇండియా విజయం సాధించాలంటే బ్యాటర్లు రాణించాల్సి ఉంటుందని చెప్పారు.

హైఓల్టేజ్ మ్యాచ్
ఈ మ్యాచ్​ కోసం భారత్ , పాకిస్థాన్ ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తప్ప మిగతా బ్యాటర్లందరూ ప్రాక్టీస్ చేశారు. అలాగే షహీన్ షా అఫ్రిదీ, హరిస్ రౌఫ్ చెరో ఏడు ఓవర్లు బౌలింగ్ చేశారు. పాకిస్థాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్, కెప్టెన్ రిజ్వాన్ ఆటగాళ్లతో చర్చల వేల అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇటు రోహిత్ టీం పూర్తిగా కసరత్తు చేస్తోంది. పిచ్ కండీషన్లకు అనుగుణంగా తుది టీం సిద్దమైంది. ఇక, టాస్ నామ మాత్రమేనని.. భారీ స్కోరు చేసిన జట్టుకే విజయం దక్కుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+