క్రికెట్‌కు ఐపీఎల్ స్టార్ గుడ్‌బై
Shaun Marsh: ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ షాన్ మార్ష్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ఇంటర్నేషనల్స్, వన్డేలు, టెస్ట్.. ఫార్మట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్స్‌లో భాగంగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్- సిడ్నీ థండర్స్ మధ్య జరిగే మ్యాచ్..అతనికి చివరిది అవుతుంది.
కేరీర్ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోంది షాన్ మార్ష్ కేరీర్. బిగ్ బాష్ లీగ్స్‌లో షాన్ మార్ష్.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్నాడు. అయిదు మ్యాచ్‌లల్లో 181 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 45.25 అతని బ్యాటింగ్ యావరేజ్. 138.16 స్ట్రైక్ రేట్‌ను రికార్డ్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో సుదీర్ఘకాలం పాటు ఆడిన అనుభవం అతనికి ఉంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ టోర్నీ ఆడాడు. 2009 సీజన్ మినహాయిస్తే 2008 నుంచి 2017 వరకు ఐపీఎల్‌లో క్రమం తప్పకుండా మ్యాచ్‌లను ఆడాడు. 2017 తరువాత ఈ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడు.
2017 వరకు 71 మ్యాచ్‌లను ఆడాడు. 2,477 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 132.74 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు షాన్ మార్ష్. అయిదేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడకపోయినప్పటికీ- పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఆరో స్థానంలో నిలిచాడు.
ఫామ్‌లో ఉన్నప్పటికీ- కొంతకాలంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం, వయసు మీద పడటం.. వంటి కారణాల వల్ల రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. కుటుంబం కోసం తన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నానని మార్ష్ తెలిపాడు.












Click it and Unblock the Notifications