'అబ్బో గెలిచావులే పెద్ద టోర్నమెంట్'.. పాక్ ప్రధానికి నెటిజన్ల పంచ్!
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ చేతిలో వరుస ఓటములు ఎదురైతేనేం.. ఆసియా కప్‌లో ఓడిపోతేనేం.. 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నీలో ఇండియాపై ఒక్క మ్యాచ్ గెలవగానే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొంగిపోయారు. నిజమైన అంతర్జాతీయ వన్డేలు, టీ20లలో భారత్ ను ఎదుర్కొనే సత్తా లేక సతమతమవుతున్న పాక్ జట్టు.. కేవలం 6 ఓవర్ల ఎగ్జిబిషన్ టోర్నీలో గెలవగానే ప్రధాని స్థాయి వ్యక్తి ఏకంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఇప్పుడు నవ్వులపాలవుతోంది.
అసలేం జరిగిందంటే?
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 88 పరుగులు చేయగా.. షాషాక్ సింగ్(11 బంతుల్లో 40) రాణించాడు. అనంతరం పాకిస్తాన్ 3.5 ఓవర్లలో 92 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అబ్బాస్ అఫ్రిది, ఖవాజా నఫాయ్ చెలరేగిపోవడంతో పాకిస్తాన్ గెలిచింది.

పాక్ ప్రధాని సెలబ్రేషన్స్.. నెటిజన్ల కౌంటర్లు!
ఈ చిన్న విజయం చూడగానే పాక్ ప్రధాని షహబాద్ షపీఫ్ ఆనందానికి హద్దుల్లేవు. వెంటనే ఎక్స్ వేదికగా.. "భారత్‌పై ఘనవిజయం సాధించిన మన కుర్రాళ్లకు అభినందనలు! పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కృషి అభినందనీయం" అంటూ భారీ రేంజ్ లో పోస్ట్ చేయడం గమనార్హం. అయితే ప్రధాని పెట్టిన ట్వీట్‌లో 'ఇది మా మొదటి మ్యాచ్' అని రాశారు. కానీ అంతకంటే ముందే యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. సొంత జట్టు మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిందనే కనీస అవగాహన కూడా ప్రధానికి లేకపోవడం గమనార్హం.
ఈ ట్వీట్ చూసిన క్రీడాభిమానులు, నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. "వరల్డ్ కప్‌లలో భారత్ ను ఓడించలేక, ఇలాంటి గల్లీ క్రికెట్ తరహా 6 ఓవర్ల వినోదభరిత టోర్నీ గెలిపును ప్రధాని స్థాయిలో సంబరం చేసుకోవడం మీకే చెల్లింది సాబ్!" అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ విసిరే సవాళ్లను తట్టుకోలేక.. ఇలాంటి చిన్నా చితకా మ్యాచ్‌లకే పాక్ నేతలు మురిసిపోతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
Congratulations to our boys on a superb four-wicket victory over India in the opening clash of the Hong Kong Sixes 2026! It was a good game of cricket I also commend Chairman PCB Mohsin Naqvi @MohsinnaqviC42 and his team for their dedicated efforts in preparing and supporting our players.
— Shehbaz Sharif (@CMShehbaz) October 30, 2026














Click it and Unblock the Notifications
