హ్యాట్రిక్ కొట్టినా ఆగట్లేదుగా.. నాలుగో పెళ్లి నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియాలో ఆయన నాలుగో పెళ్లి గురించి వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. షోయబ్ మాలిక్ మళ్లీ ఓ కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారనే ప్రచారం ప్రస్తుతం క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాలుగో పెళ్లి వార్తలు.. మోడల్ వనీజా సత్తార్‌తో రిలేషన్?
షోయబ్ మాలిక్ పాకిస్తానీ మోడల్ కమ్ నటి వనీజా సత్తార్‌ను నాలుగు వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై షోయబ్ మాలిక్ గానీ, వనీజా సత్తార్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా షోయబ్ మాలిక్‌తో పేరు ముడిపడిన ఈ వనీజా సత్తార్ ఎవరనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎవరీ వనీజా సత్తార్?
పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించిన 31 ఏళ్ల వనీజా సత్తార్ అక్కడి టెలివిజన్ పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కరాచీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అహ్మద్ జహాంగేబ్ తీసిన 'తేరా మేరా హై ప్యార్ అమర్' మ్యూజిక్ వీడియోతో మంచి బ్రేక్ సాధించిన వనీజా సత్తార్.. ఆ తర్వాత నటనా రంగానికి మారారు. 'లాడ్లీ' అనే హిట్ డ్రామా సీరియల్లో 'నాజో' పాత్ర ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'మర్హమ్', 'ఎహద్-ఎ-వఫా', 'కుచ్ అన్‌కహీ', 'టూటా హువా దిల్' వంటి ప్రముఖ షోలలో కూడా ఆమె నటించారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.25 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
షోయబ్ మాలిక్ గత ముగ్గురు భార్యల వివరాలు
షోయబ్ మాలిక్ మొదటి వివాహం 2002లో ఆయేషా సిద్దిఖీతో జరిగింది. దాదాపు 8 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2010లోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే మనస్పర్థల కారణంగా 2024 ఆరంభంలో వీరిద్దరూ విడిపోయినట్లు ప్రకటన వచ్చింది.
సనా జావేద్‌తో మూడో వివాహం.. మళ్లీ నాలుగో పెళ్లి ప్రచారం!
సానియా మీర్జాతో విడాకుల అనంతరం మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను 2024 జనవరి 19న మూడో వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సనా జావేద్‌ను పెళ్లాడిన రెండేళ్ల వ్యవధిలోనే ఇప్పుడు వనీజా సత్తార్‌తో నాలుగో పెళ్లి చేసుకుంటున్నారంటూ జోరుగా వార్తలు రావడం గమనార్హం. ఈ సంచలనాత్మక ప్రచారానికి షోయబ్ మాలిక్ ఏ విధంగా చెక్ పెడతారో వేచి చూడాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
