సానియా మీర్జా శాపం...షోయబ్ మాలిక్ మూడో పెళ్లి పెటాకులు
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సానియాతో 14 ఏళ్ల దాంపత్య బంధానికి 2024లో విడాకులతో ముగింపు పలికిన మాలిక్, వెంటనే పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూడో బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.సానియా మీర్జా కంటే ముందు షోయబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఎక్కువ కాలం కలిసి జీవించ లేకపోయాడు. ఆ వెంటనే సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు.
సానియా మీర్జా వైవాహిక జీవితం సైతం విషాదంగా ముగిసిన సంగతి తెలిసిన విషయమే. గతేడాది ఆమె తన భర్త షోయబ్ మాలిక్‌తో 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికింది. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంతో, సానియా-షోయబ్ బంధం తెగిపోయింది. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధమే వారి విడాకులకు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి.

సానియాకు విడాకులిచ్చిన తర్వాత షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా వీరి వైవాహిక జీవితం గురించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సనా జావేద్ సైతం షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందని పాక్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతున్నాయి. సనా జావేద్‌కు షోయబ్ మొదటి భర్త కాదు. ఆమె పాకిస్థాన్‌కు చెందిన సింగర్ ఉమర్ జస్వాల్‌ను మొదటి వివాహం చేసుకుంది. ఆ తర్వాత షోయబ్‌తో పరిచయం ఏర్పడటం అది ప్రేమగా మారడంతో ఉమర్ జస్వాల్‌కు విడాకులిచ్చి..షోయబ్‌ను రెండో వివాహం చేసుకుంది.
కొన్ని నెలల కిందట పెళ్లి చేసుకుని, అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించిన షోయబ్-సనా జంట మధ్య ఇటీవల కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విడాకుల వార్తలకు బలం చేకూర్చే సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
షోయబ్, సనా ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇది బంధంలో దూరం పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. టీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ఈ జంట పాల్గొనగా... షోయబ్ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా, సనా ముఖంపై కోపం, అసహనం స్పష్టంగా కనిపించింది. ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ, ఇద్దరూ దూరం దూరంగా ఉంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా కనిపించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో, విడాకుల వార్తలు మరింత బలపడ్డాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications