ఐపీఎల్ లో మరో బిగ్ వికెట్ అవుట్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజీనామాలు, వీడ్కోళ్ల పరంపర కొనసాగుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఈ టోర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ లీగ్స్ లల్లో ఆడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పుడు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది ఐపీఎల్ కు. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. తన పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా వెల్లడించాడు. ఐపీఎల్ తో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధానికి తెరపడిందని పేర్కొన్నాడు.

ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ నిర్ధారించింది. రాహుల్ ద్రావిడ్ జట్టు నుండి నిష్క్రమించనున్నట్లు వెల్లడించింది. గతంలో భారత జట్టుకు హెడ్ కోచ్ గా పని చేశాడు ద్రావిడ్. అక్కడ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనను తమ జట్టులోకి ఆహ్వానించింది రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ.
గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన హెడ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు ద్రావిడ్. టీ20 వరల్డ్ కప్ తర్వాత బాధ్యతలు అప్పగించింది. విక్రమ్ రాథోర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకుంది. ఈ సీజన్ లో అత్యంత పేలవంగా ఆడింది రాజస్థాన్ రాయల్స్. లీగ్స్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్ లల్లో నాలుగింట్లో మాత్రమే నెగ్గింది. 10 మ్యాచ్ లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
దీని దెబ్బకు జట్టు మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికొచ్చింది ఫ్రాంఛైజీ యాజమాన్యం. ద్రావిడ్‌కు మరింత విస్తృతమైన పాత్రను ఆఫర్ చేసింది. దీనికి ఆయన అంగీకరించలేదు. ఫలితంగా జట్టు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. IPL 2026 మెగా వేలానికి ముందు తన పదవికి రాజీనామా చేసిన వారిలో రెండో హెడ్ కోచ్ ద్రావిడ్.
Your presence in Pink inspired both the young and the seasoned. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
Forever a Royal. Forever grateful. 🤝 pic.twitter.com/XT4kUkcqMa
ఇంతకుముందు చంద్రకాంత్ పండిట్.. కోల్‌కతా నైట్ రైడర్స్ కు గుడ్ బై చెప్పాడు. 2023లో కేకేఆర్ హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించిన చంద్రకాంత్ పండిట్.. తన జట్టును గత ఏడాది ఛాంపియన్ గా నిలిపాడు. ఆశిష్ నెహ్రా తర్వాత హెడ్ కోచ్ గా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయుడు అతనొక్కడే.
Your presence in Pink inspired both the young and the seasoned. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
Forever a Royal. Forever grateful. 🤝 pic.twitter.com/XT4kUkcqMa












Click it and Unblock the Notifications