శ్రేయస్ అయ్యర్ బ్లండర్.. తొలి ఓవర్లోనే టీమిండియా కథ క్లోజ్!

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టు 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. గతంలో శ్రీలంక చేతిలో ఎదురైన 245 పరుగుల అత్యంత భారీ ఓటమి రికార్డును సమం చేసే ప్రమాదం నుంచి భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో బయటపడింది. టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం పలువురు కీలక ప్లేయర్లు.. ముఖ్యంగా రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమవడం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు జట్టు కొంపముంచాయి.

89 పరుగులకే కుప్పకూలిన టీమిండియా: 26 ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డ్
89 పరుగులకే కుప్పకూలిన టీమిండియా: 26 ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే అసలు తప్పిదం
టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి టాస్ గెలిచినప్పటికీ.. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యాడు. గత మూడు మ్యాచ్‌ల తరహాలో వర్షం ముప్పు, డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రభావం లేనప్పటికీ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద బ్లండర్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ పేలవమైన ఫీల్డింగ్‌ను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పుంజుకున్నప్పటికీ.. విల్ యంగ్ సెంచరీ, టిమ్ సీఫెర్ట్ అర్ధశతకానికి తోడు మిడిలార్డర్ రాణించడంతో కివీస్ 333 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Shreyas Iyer Blunder Costs India Team India Suffers 244-Run Defeat in 4th ODI vs New Zealand Details

తొలి ఓవర్లోనే ముగిసిన భారత్ కథ
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇంతకు ముందెన్నడూ 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. ఈ భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం అత్యవసరం కాగా.. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ తొలి ఓవర్లోనే భారత్ నడ్డి విరిచాడు. మాట్ హెన్రీ వేసిన ఆ ఒక్కో ఓవర్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే డకౌట్ గా పెవిలియన్ చేరారు. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్.. పవర్‌ప్లే ముగిసేసరికి కేవలం 26 పరుగులే చేయగలిగింది. భారత జట్టు 26.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినప్పటికీ.. మ్యాచ్ ఫలితం మొదటి ఓవర్లోనే తేలిపోయింది. సాయంత్రం వేళ ఫ్లడ్ లైట్ల కాంతిలో బంతి విపరీతంగా స్వింగ్ అవ్వడం, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా 12 వేలు, 15 వేల పురుగులు చేసిన రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు కూడా కొత్త బ్యాటర్లలా తడబడి ఔటయ్యారు.

IND vs PAK: ఫైనల్లో ఇండియా vs పాకిస్థాన్.. ప్రతీకారానికి రెడీ!
IND vs PAK: ఫైనల్లో ఇండియా vs పాకిస్థాన్.. ప్రతీకారానికి రెడీ!

బౌలర్లపై నమ్మకం లేని ఫీల్డింగ్ వ్యూహం
ఈ ఘోర ఓటమికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ వ్యూహాలు కూడా ప్రధాన కారణమయ్యాయి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సెంచరీ హీరో విల్ యంగ్ కు రెండు లైఫ్‌లు లభించాయి. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఫస్ట్ స్లిప్ మధ్య భారీ గ్యాప్ ఉంచడంతో యంగ్ ఇచ్చిన క్యాచ్ నేలపాలైంది. ఆ తర్వాత రెండు స్లిప్స్ పెట్టినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరంభంలోనే బౌలర్లపై నమ్మకంతో రెండు స్లిప్స్ ఉంచి ఉంటే విల్ యంగ్ అప్పుడే ఔటయ్యేవాడని.. మ్యాచ్ స్వరూపమే మారిపోయేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+