సిరీస్ డ్రాపై శ్రేయస్ అయ్యర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ తప్పులే కొంపముంచాయా?
వెస్టిండీస్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విండీస్ జట్టుతో టీ20 సిరీస్‌లోని రెండో, నాలుగో మ్యాచుల్లో బౌలింగ్ విభాగంలో మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే భారత్ ఈ సిరీస్ ను సునాయాసంగా కైవసం చేసుకుని ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.
ఐదో, నిర్ణయాత్మక మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. వెస్టిండీస్ జట్టు ప్రదర్శనను, ముఖ్యంగా విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ బ్యాటింగ్‌ను ప్రశంసించారు. కొన్ని మ్యాచుల్లో భారత బౌలర్లు మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. కానీ ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని.. కరీబియన్ బ్యాటర్లు సిరీస్ అంతటా అద్భుతంగా ఆడారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా షాయ్ హోప్ ఇన్నింగ్స్ మ్యాచ్ ను మలుపు తిప్పాయన్నారు. అయితే మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా తన దూకుడును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఇక రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కకపోవడంపై శ్రేయస్ అయ్యర్ స్పందించారు. జట్టులో ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నందున వైభవ్ సూర్యవంశీ కాస్త ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నారు. ప్రాసెస్, ప్రాక్టీస్ పై దృష్టి పెడితే వైభవ్ సూర్యవంశీకి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని, ఈ విషయమై ఆయనతో నిరంతరం మాట్లాడుతున్నానని వెల్లడించారు.
వరుస పర్యటనలు బిజీ షెడ్యూల్, ప్రయాణాల ఒత్తిడిపై అడిగిన ప్రశ్నకు శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. భారత క్రికెటర్లకు దేశవాళీ ప్రయాణాలు కొత్తేమీ కాదని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ఇది తమకు ఓ సాధారణ విషయమేనని.. ఆటగాళ్లందరూ ప్రయాణ ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
