IND vs WI: మ్యాచ్‌కు వాన గండం: డిసైడర్ పోరులో టాస్ ఆలస్యం!
IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉండటంతో నేడు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. అయితే బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ టాస్ పడటంలో ఆలస్యమవుతోంది. వర్షం తగ్గగానే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం చాలాసేపు పడితే అంపైర్లు ఓవర్లను తగ్గించే అవకాశం ఉంది.
ఈ సిరీస్ అంతటా బ్యాటర్ల ఆధిపత్యమే కనిపిస్తోంది. లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ ఇరు జట్లు 200లకు పైగా పరుగులు సాధించాయి. రెండు సార్లు స్కోరు 250 దాటడం విశేషం. భారత్ తరఫున కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4 మ్యాచుల్లో 214.86 స్ట్రైక్ రేట్‌తో 159 పరుగులు చేయగా.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 4 మ్యాచుల్లో 190.51 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. బౌలింగ్ విభాగంలో ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ 6 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టాడు.

హెడ్-టు-హెడ్ గణాంకాల విషయానికి వస్తే.. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 టీ20 మ్యాచులు జరగగా.. భారత్ 22 మ్యాచుల్లో గెలుపొందింది. వెస్టిండీస్ 12 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. రికార్డుల పరంగా భారత్‌దే పైచేయిగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత సిరీస్‌లో వెస్టిండీస్ గట్టి పోటీనిస్తోంది. ఇక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications
