భారత్‌కు డబుల్ ధమాకా.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్!

ICC Player of the Month: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సెప్టెంబర్ నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ను ప్రకటించింది. పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ భారత ఆటగాళ్లు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ఓపెనర్ షఫాలీ వర్మ ఈ అవార్డును గెలుచుకుంది.

IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!
IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!

ఐదోసారి ఈ అవార్డును గెలుచుకున్న శుభ్‌మన్ గిల్
ఈ అవార్డు రేసులో భారత్‌కు చెందిన అభిషేక్ శర్మ, జింబాబ్వేకు చెందిన సికందర్ రజాలతో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. సెప్టెంబర్‌లో శుభ్‌మన్ గిల్ భారత్ తరఫున రెండు వన్డేలు ఆడి 110, 223 పరుగులు సాధించాడు. గౌహతిలో వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ 223 పరుగులు చేసి, వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించాడు. శుభ్‌మన్ గిల్ 117 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన వన్డే డబుల్ సెంచరీని కూడా నమోదు చేశాడు.

Shubman Gill and Shafali Verma Win ICC Player of the Month Awards for September 2026 Full Details

శుభ్‌మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు . గతంలో శుభ్‌మన్ గిల్ జనవరి 2023, సెప్టెంబర్ 2023, ఫిబ్రవరి 2025 మరియు జూలై 2025లలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్ కూడా శుభ్‌మన్ గిల్ కావడం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజమ్ మూడుసార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.

IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!
IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!

షెఫాలీ వర్మ ఆల్ రౌండ్ గేమ్
మహిళల విభాగంలో షెఫాలీ వర్మ శ్రీలంకకు చెందిన చమరి అటపట్టు, భారత్‌కు చెందిన శ్రీ చరణీలను ఓడించింది. సెప్టెంబర్‌లో భారత్ ఆసియా కప్ టైటిల్‌తో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది. సెప్టెంబర్‌లో ఆడిన 7 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో షెఫాలీ 360 పరుగులు చేసింది. ఆమె సగటు 72 కాగా, స్ట్రైక్ రేట్ 185గా ఉంది. ఈ సమయంలో ఆమె రెండు అర్ధశతకాలు, ఒక శతకం సాధించింది. ఆసియా కప్ సెమీ-ఫైనల్, ఫైనల్‌లో అర్ధశతకాలు సాధించిన షెఫాలీ , ఆసియా క్రీడల సెమీ-ఫైనల్‌లో 100 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. దీనితో పాటు ఆమె బౌలింగ్‌లో 6 వికెట్లు కూడా పడగొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+