శుభ్‌మన్ గిల్ కు జాక్ పాట్: చరిత్ర తిరగరాసిన కివీస్ బౌలర్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భారత జట్టు ప్లేయర్లు సత్తా చాటారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్ కేటగరిలో తడాఖా చూపాడు. ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. టెస్ట్ బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ ప్రిత్ బుమ్రాతో టాప్ కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ తిరిగి టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇటీవలి కాలంలో వన్డేల్లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్న శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు ఎగబాకి తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిఛెల్ కంటే గిల్ కేవలం 24 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనుక ఉన్నాడు. డారిల్ మిఛెల్ 791 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గిల్ పాయింట్లు 768. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఏకంగా 21 స్థానాలు మెరుగుపరుచుకుని 43వ స్థానానికి చేరుకున్నాడు.

Shubman Gill Climbs Latest ICC ODI Rankings Matt Henry become No 1 Test first NZ bowler in 36 years

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ జట్టు ప్లేయర్లకు బూస్ట్ ఇచ్చింది. దీని తర్వాతే వారందరి ర్యాంకింగ్స్ అన్నీ కూడా మెరుగుపడ్డాయి. టీమిండియా బౌలర్లు కూడా ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 16 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకోగా, ప్రసిద్ధ్ కృష్ణ 34 స్థానాలు దూసుకెళ్లి, 58వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 17 స్థానాలు మెరుగుపరుచుకుని 71వ స్థానంలో నిలిచాడు.

టెస్ట్ బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 11 వికెట్లతో చెలరేగిన హెన్రీ.. ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. హెన్రీ తన అత్యుత్తమ బౌలింగ్‌తో 870 పాయింట్లతో ఈ స్థానాన్ని పంచుకున్నాడు. కివీస్ చరిత్రలో సర్ రిచర్డ్ హాడ్లీ, జాక్ కోవీల తర్వాత ఈ మైలురాయిని అందుకున్న మూడో బౌలర్‌గా హెన్రీ నిలిచాడు.

36 సంవత్సరాల తర్వాత ఓ న్యూజిలాండ్ బౌలర్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. జాక్ కోవీ 1947లో టాపర్ గా నిలిచాడు. రిచర్డ్ హ్యాడ్లీ 1984 నుంచి 1990 వరకు కొనసాగాడు. టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ వెటరన్ జో రూట్ మళ్లీ అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. కివీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో 46, 77 పరుగులతో రాణించిన రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌లను వెనక్కి నెట్టి కెరీర్‌లో 12వ సారి నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు.

అదే సమయంలో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర రెండంచెలు ఎగబాకి 10వ స్థానానికి, డారిల్ మిఛెల్ ఐదు స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి చేరుకుని సత్తా చాటారు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో.. డారిల్ మిఛెల్- 815, గిల్- 791, విరాట్ కోహ్లీ- 768, రోహిత్ శర్మ- 754, ఇబ్రహీం జడ్రాన్- 712, బాబర్ ఆజమ్- 689, షై హోప్- 683, హ్యారీ టెక్టార్- 679, చరిత్ శ్రీలంక- 659, హ్యారీ బ్రూక్- 656 పాయింట్లతో టాప్ 10లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+