IPLలో ఎవరూ కొనకపోవడంతో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన టీమిండియా క్రికెటర్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం, సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకున్నాయి. అయితే ఎంత స్టార్ ప్లేయర్ అయిన సరే ఫాంలో లేకపోతే వారిని జట్టులోకి తీసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపించలేదు.
కేన్ విలియమ్స్‌సన్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా వంటి స్టార్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో తనను ఎవరూ తీసుకోలేదని ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా క్రికెటర్. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పేశాడు.

సిద్దార్థ్ కౌల్ భారతీయ క్రికెట్ జట్టు తరపున ఆడిన ఫాస్ట్ బౌలర్. 2018లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాదిలో ఇంగ్లాండ్‌తో వన్డే డెబ్యూ చేశాడు. 2019లో చివరిసారిగా భారత జట్టు తరపున ఆడాడు. 2025 IPL వేలంలో ఎవరూ కొనకపోవడంతో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్‌హెచ్ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ పేసర్.. 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో సిద్దార్థ్ కౌల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.












Click it and Unblock the Notifications