సిరాజ్ కు బంపర్ ఛాన్స్..!!

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరచినందుకు ఆయన ఈ గుర్తింపు పొందాడు. సిరాజ్‌తో పాటు మరో ఇద్దరు బౌలర్లు.. న్యూజిలాండ్ సీమర్ మాట్ హెన్రీ, వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ జేడెన్ సీల్స్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.

ఆగస్టులో ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.. 31 ఏళ్ల సిరాజ్. ఆ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా చివరి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఇంగ్లాండ్‌ను 367 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

Siraj earns nomination for ICC Player of the Month

మొత్తం తొమ్మిది వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఆ సిరీస్ లో మొత్తం 23 వికెట్లతో సత్తా చాటాడు సిరాజ్. హయ్యెస్ట్ వికెెట్ టేకర్ గా నిలిచాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో టాపర్ గా నిలిచాడు. త్వరలో దీనికి సంబంధించిన ఫలితాలను ఐసీసీ వెల్లడించనుంది. మాట్ హెన్రీ, జేడెన్ సీల్స్ కంటే మెరుగ్గా బౌలింగ్ ప్రదర్శన ఉన్నందు వల్ల సిరాజ్ కే ఈ అవార్డు లభించే అవకాశాలు ఉన్నాయి.

న్యూజిలాండ్- జింబాబ్వే మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు మాట్ హెన్రీ. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను న్యూజీలాండ్ 2-0 తేడాతో గెలుచుకుంది. హెన్రీ మొత్తం 16 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో విజయం సాధించడంలో జేడెన్ సీల్స్ కీలక పాత్ర పోషించాడు. 1991 తర్వాత ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌కు ఇది చారిత్రాత్మక విజయం.

మూడు ఇన్నింగ్స్‌లల్లో 10 వికెట్లు నేలకూల్చాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. చివరి వన్డేలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు జేడెన్. ఈ మ్యాచ్ లో ఏకంగా 202 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను మట్టికరిపించింది వెస్టిండీస్. 34 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ పై వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+