నో రోహిత్, నో గిల్: వన్డేలో డబుల్ సెంచరీ బాదిన డాషింగ్ ఓపెనర్

Pathum Nissanka: పథుమ్ నిశ్శంక.. శ్రీలంకకు చెందిన యంగ్ డాషింగ్ ఓపెనర్. వన్డే ఇంటర్నేషనల్స్‌లో చరిత్ర సృష్టించాడు. డబుల్ సెంచరీ చేశాడు. దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌పై జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడీ బ్యాటర్.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ మ్యాచ్, మూడు చొప్పున వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతోంది. ఈ టూర్‌లో ఇప్పటికే ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు లంకేయులు. తొలి వన్డే కూడా వారి ఖాతాలోనే పడటం ఖాయంగా కనిపిస్తోంది.

SL vs AFG 1st ODI: Pathum Nissanka scripted history as scored 210

పల్లెకెలెలో జరుగుతున్న ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 50 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక దుమ్ము లేపాడు. సునామీ ఇన్నింగ్ ఆడాడు. 139 బంతుల్లో 210 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎనిమిది భారీ సిక్సర్లు, ఏకంగా 20 ఫోర్లు కొట్టాడు.

శ్రీలంక తరఫున డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్న తొలి బ్యాటర్ అతనొక్కడే. లంక లెజెండరీ ప్లేయర్లు సనత్ జయసూర్య, అరవింద డిసిల్వా, అర్జున రణతుంగ, కుమార సంగక్కార, జయవర్ధనె, తిలకరత్నె దిల్షాన్.. వంటి క్రికెటర్లెవరూ సాధించలేని రికార్డును నెలకొల్పాడు నిశ్శంక.

అతని ఇన్నింగ్ ధాటికి శ్రీలంక స్కోర్ బోర్డు ఉరకలు పెట్టింది. నిర్ణీత 50 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికే 381 పరుగులు చేయడం కూడా ఆ జట్టు తరఫున రికార్డే. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో- 88, కేప్టెన్ కుశాల్ మెండిస్-16, సదీర సమరవిక్రమ- 45 పరుగులు చేశారు. ఏడు పరుగులతో చరిత్ అసలంక చివరి వరకూ నిశ్శంకకు తోడుగా నిలిచాడు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లల్లో ఫరీద్ అహ్మద్ ఒక్కడేే రెండు వికెట్లు పడగొట్టాడు గానీ భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. 79 పరుగులు ఇచ్చి అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ నబీ ఓ వికెట్ పడగొట్టాడు.

381 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ తడబడుతోంది. ఓటమి దిశగా సాగుతోంది. 8 ఓవర్లల్లో 51 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్- 1, ఇబ్రహీం జడ్రాన్- 4, రహ్మద్ షా-7, కేప్టెన్ హస్మతుల్లా షహీదీ-7 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

లంక బౌలర్లల్లో ప్రమోద్ మదుషాన్ 4 ఓవర్లల్లో మూడు వికెట్లతో ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడు. దుష్మంత చమీర్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదీన్ నబీ క్రీజ్‌లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+