బయటపడ్డ స్మృతీ మంధాన రిలేషన్‌షిప్..5 ఏళ్లుగా ఆ స్టార్‌తో డేటింగ్
స్మృతీ మంధాన ..ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు.మిథాలి రాజ్ తర్వాత క్రికెట్‌లో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఉమెన్ క్రికెటర్ ఆమె అని చెప్పడంతో ఎటువంటి అతిశేయోక్తి లేదు. ఇండియాన్ ఉమెన్ క్రికెట్‌లో స్మృతీ మంధాన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆట కంటే అందంతోనే ఆమె ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని అందం స్మృతీ మంధాన సొంతం.
ఆమెను చూడటానికే అభిమానులు గ్రౌండ్‌కు వస్తున్నారంటే స్మృతీ మంధాన ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా స్మృతీ మంధానకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏదైన ఫొటో పెట్టిందంటే అది క్షణాల్లోనే వైరల్‌గా మారుతోంది. యూత్ కలల రాణిగా మారిపోయింది స్మృతీ మంధాన. ఇదే సమయంలో ఆటలో కూడా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది.

ఉమెన్ ఐపీఎల్‌లో బెంగళూరు టీంకు ప్రతినిధ్యం వహిస్తోన్న స్మృతీ ఈ ఏడాది జట్టకు టైటిల్ కూడా అందించింది. ఇదిలా ఉంటే తాజాగా స్మృతీ మంధానకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. స్మృతీ మంధాన ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని, అతను ఆమె ప్రియుడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంగీతకారుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన ప్రేమలో ఉంది.
ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేసింది. మంధానతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను పలాష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేనా తమ మధ్య బంధానికి ఐదేళ్లు నిండాయి అని అర్థం వచ్చేలా ఐదు అంటూ హార్ట్ ఎమోజీలను జత చేశాడు.దీనిపై మంధాన స్పందించింది. లవ్ సింబల్స్‌తో తన సంతోషాన్ని తెలియజేసింది అమ్మడు. వీరి పోస్టులు వైరల్‌గా మారగా.. నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications