దక్షిణాఫ్రికా ప్రధాన బలం.. బలగం ఇదే- ఆసీస్‌తో ఫైనల్స్ పోరు

South Africa Squad WTC Final 2025: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ గడువు సమీపిస్తోంది. జూన్ 11వ తేదీన లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో అడుగుపెట్టడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి.

డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోయే జట్టును దక్షిణాఫ్రికా ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన టీమ్ ఇది. టెంబా బావుమా కేప్టెన్సీలో ఈ జట్టు.. పాట్ కమ్మిన్స్ సారథ్యాన్ని వహించే ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. జట్టులో మొత్తం ఆరు మంది బౌలర్లకు చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

South Africa named its squad for the WTC 25 final against Australia

వీరిలో నలుగురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు. గాయం కారణంగా చివరి సిరీస్‌కు దూరమైన లుంగి ఎన్గిడికి చోటు దక్కిందీ జట్టులో. కగిసొ రబడ, మార్కొ జన్‌సెన్, డేన్ పీటర్సన్, కోర్బిన్ బోష్క్.. ఆస్ట్రేలియాపై పేస్ అటాక్‌కు రెడీ అయ్యారు. కేశవ్ మహరాజ్, సెనురాన్ ముత్తుస్వామి స్పిన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో కంటిన్యూ అయ్యారు.

బౌలర్లు కగిసొ రబడ, మార్కొ జన్‌సెన్‌, లుంగి ఎన్గిడితో పాటు ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్, ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్, మిడిలార్డర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఇంకా సమయం ఉన్నందున వీళ్లందరూ కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు.

దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి జట్టుగా ఆవిర్భవించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఇదే తొలిసారి. సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకిస్తాన్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే ఆస్ట్రేలియా జట్టులో- టెంబా బావుమా (కేప్టెన్), టోనీ డి జోర్జి, ఎయిడెన్ మార్క్‌రమ్, వియాన్ ముల్డర్, మార్కొ జన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సెనురన్ ముత్తుసామికి ఉన్నారు.

అంతకుముందే- క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో- పాట్ కమిన్స్ (కేప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్ ఉన్నారు. బ్రెండన్ డాగెట్.. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+