టీమిండియా.. టప టపా: పెవిలియన్ చేరిన సగం టీమ్
భారత్- దక్షిణాఫ్రికా మధ్య కోల్ కత ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 38 పరుగులకే ఏకంగా నాలుగు వికెట్లను కోల్పోయి, దయనీయ స్థితిలో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు విరుచుకుపడుతున్నారు. స్టార్ బౌలర్ల మార్కొ జెన్ సెన్, హర్మర్ చెలరేగారు. తలా ఓ రెండు వికెట్లు పంచుకున్నారు.
టీమిండియా గెలవాలంటే 125 పరుగులు చేయాలి. ఈ స్వల్ప స్కోరు ను ఛేదించడానికి జట్టు చెమటోడ్చుతోంది. యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులే ఎదుర్కొన్న ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ జెన్ సెన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ వెర్రెన్నెకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతన్ని కూడా జెన్ సెన్ బలి తీసుకున్నాడు. ఒక పరుగు మాత్రమే చేసి వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఈ తర్వాత వచ్చిన జురెల్ గానీ, రిషభ్ పంత్ గానీ ఏ మాత్రం కూడా క్రీజ్ లో కుదురుకోలేకపోయారు. జురెల్- 13, రిషభ్ పంత్- 2 పరుగులు మాత్రమే చేయలిగారు. వీరిద్దరి వికెట్లను హార్మర్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఇద్దరు ఆల్ రౌండర్లు ఆడుతున్నారు. వాషింగ్టన్ సుందర్- 29 మీద క్రీజ్ లో ఉన్నారు. , రవీంద్ర జడేజా కూడా అవుట్ అయ్యాడు.
టీమిండియా గెలవాలంటే 60 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో అయిదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మరోవంక- దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తోన్నారు. పరుగులు రావడం గగనంగా మారింది. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఆచితూచి ఆడుతున్నారు. డిఫెన్స్ కు ప్రాధాన్యత ఇస్తోన్నారు.












Click it and Unblock the Notifications