Bavuma.. ఏం హైప్ ఇచ్చావ్ మామా

కోల్ కత ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్ లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 93 పరుగులకే చాప చుట్టింది. 30 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. గెలవడానికి టీమిండియా భారీ స్కోర్ కొట్టాల్సిన పరిస్థితేమీ లేదు. చేయాల్సింది 123 పరుగులు మాత్రమే. ఊదితే ఎగిరిపోయే స్కోర్ అది. అయినా కూడా తడబడింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు తలవంచింది.

ఈ స్వల్ప స్కోరు ను అందుకోవడానికి ప్రారంభం నుంచీ జట్టు చెమటోడ్చుతూ వచ్చింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులే ఎదుర్కొన్న ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ జెన్ సెన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ వెర్రెన్నెకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతన్ని కూడా జెన్ సెన్ బలి తీసుకున్నాడు. ఒక పరుగు మాత్రమే చేసి వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

South Africa Victory in Thrilling Test Opener against India as Simon Harmer shines with 8 wickets

ఈ తర్వాత వచ్చిన జురెల్ గానీ, రిషభ్ పంత్ గానీ ఏ మాత్రం కూడా క్రీజ్ లో కుదురుకోలేకపోయారు. జురెల్- 13, రిషభ్ పంత్- 2 పరుగులు మాత్రమే చేయలిగారు. వీరిద్దరి వికెట్లను సైమన్ హార్మర్ పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కొంత వరకు ప్రతిఘటించారు గానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. 31 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. జట్టులో టాప్ స్కోరర్. అక్షర్ పటేల్- 26, రవీంద్ర జడేజా- 18 పరుగులు చేశారు.

కుల్ దీప్ యాదవ్- 1 పరుగుల చేశాడు. జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ ఖాతాలను కూడా తెరవలేకపోయారు. డకౌట్ అయ్యారు. మెడనొప్పితో బాధపడుతున్న కేప్టెన్ శుభ్ మన్ గిల్.. బ్యాటింగ్ కు దిగలేదు. టీమిండియా ఓటమిలో సైమన్ హార్మర్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్ లో కూడా నాలుగు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్లను తన ఖాతాలో వేసుకోగలిగాడు. అతని స్పిన్ మాయాజాలానికి భారత బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.

మార్కో జెన్ సెన్, కేశవ్ మహరాజ్ రెండు చొప్పున వికెట్లు నేలకూల్చారు. ఈ ఇద్దరూ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్ ల ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో ఆధిక్యతను సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన గువాహటిలో ఆరంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+