SRH vs RR: తొలి మ్యాచ్‌లో SRH గ్రాండ్ విక్టరీ
SRH vs RR: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు పోరాడి ఓడింది. ఈ క్రమంలో రాజస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బ్యాటర్లు ధ్రువ్ జురేల్(70), సంజు శాంసన్(66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా కొండంత లక్ష్యం కరగలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ, ఆడం జాంప తలో వికెట్ తీసుకున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025ను విజయంతో ప్రారంభించింది. హైదరాబాద్ తన సొంత మైదానం రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్ సెంచరీ సహాయంతో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని సాధించాడు. హైదరాబాద్‌లోని తేమతో కూడిన వేడిలో అనుభవం లేని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ IPLలోని అత్యంత ఫ్లాట్ పిచ్‌పై ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో రాయల్స్ బౌలర్లపై ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి తన ఇష్టానుసారం స్కోరు చేశాడు. ఆపై ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 అజేయంగా నిలిచి ఎస్‌ఆర్‌హెచ్ అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.

ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ రెండో వికెట్ కు 39 బంతుల్లో 85 పరుగులు జోడించారు. గత సీజన్ నుంచి సన్ రైజర్స్ తమ జోరును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్ లో రెండు వికెట్లను కోల్పోవడంతో ఐపీఎల్ అత్యధిక స్కోరు(287) ను అధిగమించలేకపోయింది. జోఫ్రా ఆర్చర్ తన ఖాతా చెత్తరికార్డును నమోదు చేసుకున్నాడు. 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి ఆ రికార్డును కైవసం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ రికార్డును ఆర్చర్ అధిగమించాడు. గత సీజన్ లో జరిగిన మ్యాచ్ లో మోహిత్ శర్మ 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుటి వరకు ఇదే చెత్త రికార్డుగా ఉండా.. జోఫ్రా ఆర్చర్ దానిని బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అతను నిలిచాడు. హైదరాబాద్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్(30) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2, తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు తీశారు.
An epic run-fest goes the way of @SunRisers 🧡
— IndianPremierLeague (@IPL) March 23, 2025
The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏
Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV












Click it and Unblock the Notifications