కావ్య పాప రోలర్ కోస్టర్ పీలింగ్స్- ఉండబట్టలేక వాళ్లకు హగ్

SRH vs Punjab Kings: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కొంటోన్న వరుస పరాయజాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బిగ్ బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ అయింది ఆరెంజ్ ఆర్మీ. పంజాబ్ కింగ్స్‌పై స్వైర విహారం చేసింది. కొండంత స్కోర్‌ను ఐస్‌క్రీమ్‌లా కరిగించి పడేసింది. ఈ నెల 17వ తేదీన తరువాతి మ్యాచ్ ఆడబోతోంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది.

ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన తరువాత ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కింది. ఈ మధ్యలో నాలుగింట్లో పరాజయాన్ని చవి చూసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.

SRH vs Punjab Kings Kavya Maran congratulating Abhishek Sharma s parents after his ton

ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 245 పరుగులు పిండుకుంది. శ్రేయస్ అయ్యర్ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 36 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లు, ఆరు బుల్లెట్ల వంటి ఫోర్లతో 82 పరుగులు చేశాడు.

ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య- 36, ప్రభ్‌సిమ్రన్ సింగ్- 42, మిడిలార్డర్‌లో నెహల్ వధేరా- 27 సత్తా చాటారు. ఇన్నింగ్ చిట్టచివరి ఓవర్‌లో మార్కస్ స్టొయినిస్ సునామీలా విరుచుకుపడటంతో పంజాబ్ కింగ్స్‌కు అదనపు పరుగులొచ్చాయి. మహ్మద్ షమీ వేసిన 20వ ఓవర్ చివరి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు స్టొయినిస్.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తెగించి ఆడింది. చావో రేవో అన్నట్లుగా చెలరేగారు బ్యాటర్లు. తొలి ఓవర్ నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 245 పరుగులను ఇంకా తొమ్మిది బంతులు మిగిలివుండగానే కొట్టిపడేశారంటే వాళ్ల బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ట్రావిస్ హెడ్ 66 పరుగులతో దూకుడుగా ఆడగా..మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లోనే 141 పరుగులు కొట్టాడు. ఈ క్రమంలో ఏకంగా 10 సిక్సర్లు బాదాడు అభిషేక్. మరో 14 బౌండరీలు అతని బ్యాట్ నుంచి జాలువారాయి. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి 17వ ఓవర్ వరకు ఆడిన బ్యాటర్లల్లో 256.36 స్ట్రైక్ రేట్‌ను మెయింటెయిన్ చేశాడు.

SRH vs Punjab Kings Kavya Maran congratulating Abhishek Sharma s parents after his ton

అభిషేక్ శర్మ ఆడుతున్నంత సేపూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ ముఖం వెలిగిపోయింది. అభిషేక్ దూకుడుగా ఆడుతున్నప్పటికీ- చేయాల్సిన స్కోర్ భారీగా ఉండటం వల్ల గెలుస్తామో లేదా.. అనే ఫీలింగ్స్ ఆమెలో కనిపించాయి.

అభిషేక్ సెంచరీ పూర్తయిన తరువాత ఇక కావ్య మారన్ ఉండబట్టలేకపోయారు. తన సంతోషాన్ని దాచుకోలేకపోయారు. పక్కనే ఉన్న అతని పేరెంట్స్‌ను అభినందిస్తూ స్వీట్ హగ్ ఇచ్చారు. అతని తల్లి మంజు శర్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తండ్రి రాజ్ కుమార్ శర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+