SRH vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ బ్యాటింగ్.. 300 లోడింగ్!

SRH vs RR: ఐపీఎల్ 2025 సీజన్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు రానుంది. హైదరాబాద్ అనగానే ఈ సారి కూడా ట్రావిస్ హెడ్ ,అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లపై అందరి దృష్టి ఉంది. ఏ రికార్డులను బద్దలు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ తొలి మూడు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కెప్టెన్సీ వహించనున్నాడు. సంజు శాంసన్ పూర్తి స్థాయి ఫిట్ నెస్ లేకపోవడంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. అంటే సంజు శాంసన్ పూర్తి స్థాయి బ్యాటర్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయంతోనే హైదరాబాద్ కు వచ్చాడు.

ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 300 పరుగులు సాధిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 300 లోడింగ్ అంటూ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో ఎస్ఆర్‌హెచ్ 287 పరుగులు చేసింది. ఈ సారి 300+ స్కోరు చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. రాజస్థాన్ తో మ్యాచ్ లో అది సాకారమవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

SRH vs RR Rajasthan Wins Toss Sunrisers Batting Fans Expect 300 Score

ఐపీఎల్‌లో రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆధిక్యంలో ఉంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో సన్ రైజర్స్ జట్టు 11 గెలిచింది. రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. అందుకే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు.సన్‌రైజర్స్ జట్టును దాని సొంత మైదానంలో ఓడించడం చాలా కష్టం. సన్‌రైజర్స్ జట్టు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్‌తో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో, అది నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది, అయితే రాజస్థాన్ ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, 18వ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ కఠినమైన సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇరుజట్ల ప్లేయింగ్-11 ఇదే..

రాజస్థాన్ జట్టు-యశస్వి జైస్వాల్, శుభం దుబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఫరూఖీ.

హైదరాబాద్ జట్టు - ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+