కావ్యా పాప టేస్ట్ ఇదా: ఊర మాస్ ఏంథెమ్: జీవీ అరవం మసాలా ఘాటు

SRH vs RR 2025: నేడు సూపర్ సండే. ఐపీఎల్ 2025 సీజన్, 18వ ఎడిషన్‌లో భాగంగా డబుల్ హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడబోతోంది. తన హోమ్ పిచ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు గేమ్ మొదలవుతుంది.

రెండో మ్యాచ్- ఈ సాయంత్రం 7:30 గంటలకు జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్ప్, ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోన్నాయి. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు కూడా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే మ్యాచ్‌లే. పైసా వసూల్ చేసేవే.

SRH vs RR Sunrisers Hyderabad team s anthem for IPL 2025 composed by GV Prakash Kumar

తన తొలి మ్యాచ్ ఆడబోతోన్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓ గెట్ టు గెదర్ మీటింగ్‌ను నిర్వహించింది. ఆరెంజ్ ఆర్మీ మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఇది ఏర్పాటైంది. ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లందరూ ఇందులో పాల్గొన్నారు. ఫ్యాన్స్‌తో ఫేస్ టు ఫేస్ ముచ్చట్లు పెట్టారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. సరదాగా సాగిందీ ప్రోగ్రామ్.

అదే సమయంలో ఈ ఐపీఎల్ సీజన్‌ ఏంథెమ్‌ వీడియో కూడా విడుదలైంది. కొద్దిసేపటి కిందటే ఫ్రాంఛైజీ దీన్ని విడుదల చేసింది. ఊర మాస్ ఏంథెమ్ ఇది. ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు. దీన్ని పాడింది కూడా అతనే. ఫక్తు తమిళ స్టైల్‌లో కనిపించిందీ ఏంథెమ్.

సన్‌రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో..సుర్రా సుర్ పటాసులే, కిర్రా కిర్ ఖిలాడిలే.. అనే పాట ఇది. 1:32 నిమిషాల నిడివి ఉన్న ఈ ఏంథెమ్‌లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్.. ఊరమాస్ స్టైల్‌లో కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+