ప్రత్యర్థుల పాలిట అసురులు- 300
SRH vs RR 2025: నేడు సూపర్ సండే. ఐపీఎల్ 2025 సీజన్, 18వ ఎడిషన్‌లో భాగంగా డబుల్ హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడబోతోంది. తన హోమ్ పిచ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు గేమ్ మొదలవుతుంది.
రెండో మ్యాచ్- ఈ సాయంత్రం 7:30 గంటలకు జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్ప్, ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోన్నాయి. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు కూడా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే మ్యాచ్‌లే. పైసా వసూల్ చేసేవే.

తన తొలి మ్యాచ్ ఆడబోతోన్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓ గెట్ టు గెదర్ మీటింగ్‌ను నిర్వహించింది. ఆరెంజ్ ఆర్మీ మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఇది ఏర్పాటైంది. ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లందరూ ఇందులో పాల్గొన్నారు. ఫ్యాన్స్‌తో ఫేస్ టు ఫేస్ ముచ్చట్లు పెట్టారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. సరదాగా సాగిందీ ప్రోగ్రామ్.
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సమాధానాలను ఇచ్చాడు. తమ లక్ష్యం ఏమిటనేది స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో 300 పరుగులు కొట్టబోతోన్నామంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్రత్యర్థుల పాలిట ఓ డిస్ట్రక్షన్‌లా మారిన విషయం తెలిసిందే.
ఏకంగా మూడుసార్లు 250 మార్క్‌ను దాటిందీ ఆరెంజ్ ఆర్మీ. గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పైనా చెలరేగింది. మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ కేపిటల్స్‌పై ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు కొట్టింది.
The Best Entry Award in SRH Meet & Great Goes To Abhishek Sharma! pic.twitter.com/8JPELQhoYp
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 22, 2025
ఇప్పుడు కూడా అదే తరహాలో నిప్పుల చెరగాలంటూ అభిమానులు కోరుగా.. దాన్ని మించి అంటూ సంకేతాలు ఇఛ్చాడు పాట్ కమ్మిన్స్. ఈ సీజన్‌లో 300 పరుగులు కొట్టబోతోన్నామని చెప్పాడు. జట్టు మొత్తం కూడా మ్యాచ్ కోసం ఎదురుచూస్తోందని, మాంఛి ఆకలి మీద ఉన్నారని అన్నాడు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications