Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సన్‌రైజర్స్.. వై నాట్ 300..!!

SRH vs RR 2025: నేడు సూపర్ సండే. ఐపీఎల్ 2025 సీజన్, 18వ ఎడిషన్‌లో భాగంగా డబుల్ హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడబోతోంది. తన హోమ్ పిచ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు గేమ్ మొదలవుతుంది.

రెండో మ్యాచ్- ఈ సాయంత్రం 7:30 గంటలకు జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్ప్, ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోన్నాయి. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు కూడా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే మ్యాచ్‌లే. పైసా వసూల్ చేసేవే.

Klaasen

తన తొలి మ్యాచ్ ఆడబోతోన్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓ గెట్ టు గెదర్ మీటింగ్‌ను నిర్వహించింది. ఆరెంజ్ ఆర్మీ మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఇది ఏర్పాటైంది. ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లందరూ ఇందులో పాల్గొన్నారు. ఫ్యాన్స్‌తో ఫేస్ టు ఫేస్ ముచ్చట్లు పెట్టారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సమాధానాలను ఇచ్చాడు. తమ లక్ష్యం ఏమిటనేది స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో 300 పరుగులు కొట్టబోతోన్నామంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్రత్యర్థుల పాలిట ఓ డిస్ట్రక్షన్‌లా మారిన విషయం తెలిసిందే.

ప్రీమ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ ట్రవిస్ హెడ్, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ 300 కొట్టాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటోన్నారని, దీని గురించే మాట్లాడుకుంటోన్నారని గుర్తు చేశాడు.

300 పరుగులను సాధించడం కోసం దూకుడుగా బ్యాటింగ్ చేస్తామని అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా ఉందని, ప్లేయర్లు ఫామ్‌లో ఉన్నారని క్లాసెన్ పేర్కొన్నాడు. 300 పరుగులను కొట్టడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదని వ్యాఖ్యానించాడు. 100 శాతం ఎఫర్ట్ పెట్టి ఆడితే- అసలు 300 పరుగుల లెక్కే కాదనీ చెప్పాడు.

Take a Poll

ఏకంగా మూడుసార్లు 250 మార్క్‌ను దాటిందీ ఆరెంజ్ ఆర్మీ. గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పైనా చెలరేగింది. మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ కేపిటల్స్‌పై ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు కొట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+