SRH vs RR: ఎస్ఆర్‌హెచ్ పెను విధ్వంసం.. దంచికొట్టిన బ్యాటర్లు
SRH vs RR: ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పెనువిధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరును సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఈ స్కోరు ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం. గత సీజన్ లో ఈ జట్టే అతిపెద్ద స్కోరు 287 పరుగులను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ (106*) సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లోనే ఇషాన్ కిషన్ 11 ఫోర్లు, 6 సిక్సులతో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా బంతిని బాదుతూనే ఉన్నారు. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు ప్రారంభం నుంచి రెచ్చిపోయి ఆడారు. పవర్ ప్లేలోనే 89 పరుగులు రావడం గమనార్హం. అభిషేక్ శర్మ ఔటైన తర్వాత కూడా ట్రావిస్ హెడ్ తన పనిని కొనసాగించాడు. ఎస్ఆర్‌హెచ్ తరఫున మొదటి సారి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ తో కలిసి రాజస్థాన్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డితో కలిసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

అర్థశతకం సాధించిన తర్వాత ఇషాన్ కిషన్ కాసేపు నెమ్మదించాడు. కానీ చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.హైదరాబాద్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్(30) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2, తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు బౌండరీలు బాదేశారు. ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు సమర్పించుకున్నాడు.
సన్‌రైజర్స్ 286 పరుగులు
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ తమ సొంత అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. గత సీజన్‌లో ఇదే జట్టు 287 పరుగుల భారీ స్కోరు సాధించడం ద్వారా ఈ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. 300 ప్లస్ స్కోరు వస్తుందనే అభిమానుల ఆశలు కొంచెంలో నెరవేరలేదు. ఈ సీజన్ లో ఆ ఆశలు నెరవేరుతాయని తెలుస్తోంది.
- Hundred in Buchi Babu
— Johns. (@CricCrazyJohns) March 23, 2025
- Hundred in Duleep Trophy
- Hundred in Ranji Trophy
- Hundred in Vijay Hazare Trophy
- Hundred in IPL
A COMEBACK FOR AGES, ISHAN KISHAN 🇮🇳 pic.twitter.com/ycZVI8xtz3
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications