అసాధ్యం అనుకున్న సచిన్ రికార్డును సమం చేసిన మొనగాడు..!!

టెస్ట్ క్రికెట్ చరిత్రలో తిరుగులేని రికార్డులు సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్నాయి. వాటిని అందుకోవడం దాదాపు అసాధ్యం అని అనుకుంటూనే వస్తూ వచ్చాం ఇన్నాళ్లు. టెస్ట్, వన్డేల్లో సచిన్ సాధించిన రికార్డులు తెరమరుగు అయ్యే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వాటికి ఎసరు పడింది. స్టార్ బ్యాటర్ ఒకరు.. ఆయన రికార్డును ప్రస్తుతానికి సమం చేశాడు. అతని ఫామ్ చూస్తోంటే.. దాన్ని అధిగమించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

ఆ రికార్డుకు ఎసరు పెట్టింది ఎవరో కాదు.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. టెస్ట్ మ్యాచ్ లల్లో సచిన్ టెండూల్కర్ పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును రూట్ సమం చేశాడు. పాకిస్తాన్‌తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఈ అసాధ్యం అనుకున్న మైలురాయిని చేరుకున్నాడు. దీన్ని చెరిపేయడానికి ఒక్క హాఫ్ సెంచరీ దూరంలో మాత్రమే నిలిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లోనే అది సాధ్యపడొచ్చు కూడా.

Star batter Equals Sachin Tendulkar s Most Test Fifties in 1st Test Match on Pakistan at Headingley

ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ క్లాసిక్ ఆటను ప్రదర్శించాడు. 112 బంతులను ఎదుర్కొని 10 ఫోర్ల సహాయంతో 66 పరుగులు సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అతనికి ఇది 68వ హాఫ్ సెంచరీ. 48 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో జో రూట్ సమయస్ఫూర్తితో ఆడాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్‌తో కలిసి ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లతో అలరించాడు రూట్.

టెస్టుల్లో టీ20 ఫార్మట్ సిక్సర్లు- టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అరుదైన రికార్డ్
టెస్టుల్లో టీ20 ఫార్మట్ సిక్సర్లు- టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అరుదైన రికార్డ్

ఖుర్రం షాజాద్ వేసిన ఒక ఇన్‌స్వింగర్ డెలివరీకి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పటికే ఇంగ్లాండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. తన టెస్ట్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడాడు సచిన్. 329 ఇన్నింగ్స్‌లలో 68 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. జో రూట్ 167 టెస్టుల్లో 305 ఇన్నింగ్స్‌లలోనే 68 హాఫ్ సెంచరీలను చేయగలిగాడు. వీరిద్దరి మధ్య 33 టెస్ట్ మ్యాచ్ ల వ్యత్యాసం ఉంది. వీరి తర్వాతి స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు శివనారాయణ్ చందర్ పాల్ ఉన్నాడు. 66 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు.

శ్రావణంలో దానం చేయదగ్గ వస్తువులు.. ఓ దోసెడు పోసినా చాలు
శ్రావణంలో దానం చేయదగ్గ వస్తువులు.. ఓ దోసెడు పోసినా చాలు

మొత్తంగా.. సచిన్ టెండూల్కర్- 68, జో రూట్- 68, శివనారాయణ్ చందర్ పాల్- 66, రాహుల్ ద్రావిడ్- 63, రికీ పాంటింగ్- 62 హాఫ్ సెంచరీలతో టాప్ 5లో ఉన్నారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్‌లోనే జో రూట్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడం ఖాయం. ప్రపంచంలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇంకా సుదీర్ఘ క్రికెట్ ఆడే సత్తా ఉన్నందున ఈ ఫార్మాట్‌లో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తిరగరాస్తాడనే అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q