ఆస్ట్రేలియా మాజీ స్టార్ బ్యాటర్ రికార్డ్ అవుట్- పరుగుల వరద పారిస్తోన్న డాషింగ్ ఓపెనర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తిరుగులేని రికార్డులు సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్నాయి. వాటిని అందుకోవడం దాదాపు అసాధ్యం అని అనుకుంటూనే వస్తూ వచ్చాం ఇన్నాళ్లు. టెస్ట్, వన్డేల్లో ఆయన సాధించిన రికార్డులు తెరమరుగు అయ్యే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వాటికి ఎసరు పడింది. స్టార్ బ్యాటర్ ఒకరు.. ఆయన రికార్డును ప్రస్తుతానికి సమం చేశాడు. అతని ఫామ్ చూస్తోంటే.. దాన్ని అధిగమించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
ఆ రికార్డుకు ఎసరు పెట్టింది ఎవరో కాదు.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. టెస్ట్ మ్యాచ్ లల్లో సచిన్ టెండూల్కర్ పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును రూట్ సమం చేశాడు. పాకిస్తాన్‌తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఈ అసాధ్యం అనుకున్న మైలురాయిని చేరుకున్నాడు. దీన్ని చెరిపేయడానికి ఒక్క హాఫ్ సెంచరీ దూరంలో మాత్రమే నిలిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లోనే అది సాధ్యపడొచ్చు కూడా.

టెస్ట్ ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తూ దూసుకుపోతున్న రూట్.. తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో సొంతగడ్డపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా వీరుడు రికీ పాంటింగ్ పేరిట ఉన్న దశాబ్ద కాలపు రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ లో పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రూట్ 24 పరుగులు మాత్రమే చేసి అవుటైనప్పటికీ.. ఇది ఆయనను రికార్డు పుస్తకాల్లో అగ్రస్థానానికి చేర్చింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ లల్లో రూట్ సాధించిన మొత్తం పరుగుల సంఖ్య 7,594. అంతకుముందు రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలో 7,578 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగాడు. ఆయనను అధిగమించాడు జో రూట్. టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 7,216 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్, టెండుల్కర్ రిటైర్ అయిన నేపథ్యంలో.. జో రూట్ మరిన్ని పరుగులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.
ఇంగ్లాండ్‌లో ఆయన ఇప్పటివరకు ఆడిన 89 టెస్టుల్లో 156 ఇన్నింగ్స్‌లలో 53.85 సగటుతో 7,594 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆయన 24 శతకాలు, 35 అర్ధ శతకాలు నమోదు చేశారు. ఆయనప అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254 పరుగులు. రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా వేదికగా 92 టెస్టులలో 154 ఇన్నింగ్స్ ఆడి 56.97 సగటుతో 7,578 పరుగులు చేశారు. ఆయన ఖాతాలో 23 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సొంతగడ్డపై అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లిస్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.













Click it and Unblock the Notifications