మోడ‌ల్ ఆత్మ‌హ‌త్య కేసులో స‌న్‌రైజ‌ర్స్ క్రికెట‌ర్ పేరు...

సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ పేరు బ‌య‌ట‌ప‌డింది. మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో అభిషేక్ శర్మకు స్థానిక పోలీసులు ఇటీవల నోటీసులు పంపించ‌డం జ‌రిగింది. తానియా వ‌య‌సు 28 ఏళ్లు. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగంలో పనిచేస్తోంది. సూర‌త్‌కు చెందిన ఈ మోడ‌ల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. డిస్క్ జాకీ, మేకప్ ఆర్టిస్ట్, మోడల్ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంది.

మోడ‌ల్ తానియా సింగ్‌తో SRH ప్లేయర్ అభిషేక్ శర్మ కొంతకాలంగా టచ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తానియా ఆత్మ‌హ‌త్య చేసుకోబోయే ముందు చివ‌రిసారిగా అభిషేక్ కు తన చివరి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మోడ‌ల్ తానియా ఆత్మహత్య చేసుకున్న అనంత‌రం పోలీసులు సూరత్‌లో తమ దర్యాప్తును ప్రారంభించడం జ‌రిగింది. పోలీసుల విచార‌ణ‌లో SRH ప్లేయర్ అభిషేక్ శర్మ పేరు వచ్చింది. దీంతో సూరత్ పోలీసులు ఈ SRH ఆల్‌రౌండర్‌ని విచారణకు పిలవడం జ‌రిగింది. అభిషేక్ IPL 2024 సీజన్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు.

Sunrisers cricketer named in model suicide case

ఇక‌, SRH ఆల్‌రౌండర్‌ని సన్ రైజర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి మూడు సీజన్‌లలో SRH ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. అయినా, ఇందులో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో అభిమానుల‌ను ఆక‌ట్టుకోవ‌డం జ‌రిగింది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో అభిషేక్ శర్మ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్నాడు. పంజాబ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఇక, ఈ సీజన్‌లో ఈ క్రికెట‌ర్ నాలుగు మ్యాచ్ ల్లో 28.42 సగటుతో 199 పరుగులు చేశాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+