చిన్న బ్రేక్ తరువాత సన్ రైజర్స్ బొమ్మ దద్దరిల్లింది..ఇంకో టికెట్ చిరిగింది
SRH vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలగినందున ఈ మ్యాచ్ లో గెలుపు సన్ రైజర్స్ కు పెద్దగా ఉపయోగపడట్లేదు గానీ.. సత్తా చాటుకోగలిగింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా స్టేడియంలో ఏకనా స్టేడియంలో 200 ప్లస్ స్కోర్ ను ఛేదించిన మొట్ట మొదటి జట్టుగా తన పేరును లిఖించుకోగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్.. 18.2 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి కొట్టిపడేసింది.

ప్రారంభ ఓవర్లల్లో లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్ రమ్.. సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్ భాగస్వామ్యానికి 115 పరుగుల జోడించారంటే వారి బ్యాటింగ్ ధాటి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మిఛెల్ మార్ష్ 39 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65, ఎయిడెన్ మార్క్ రమ్ 38 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 61 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ లో నికొలస్ పూరన్ దుమ్ము దులిపాడు. 26 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 45 పరుగులు బాదాడు. ఈ ముగ్గురు మినహా మరే బ్యాటర్ కూడా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.
కేప్టెన్ రిషభ్ పంత్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అతను చేసింది ఏడు పరుగులే. ఆయుష్ బదోని- 3, అబ్దుల్ సమద్- 3, శార్దుల్ ఠాకూర్- 4 చేశారు. సన్ రైజర్స్ బౌలర్లల్లో ఎషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దుబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ప్రారంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. తెగించి ఆడింది. ఓపెనర్ గా ప్రమోట్ అయిన అధర్వ తైడె 13 పరుగులనే చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన దైన శైలిలో రెచ్చిపోయి ఆడాడు. 20 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేశాడు.
ఇషాన్ కిషన్- 35, హెన్రిచ్ క్లాసెన్- 47, కమిందు మెండిస్- 32 పరుగులతో ధాటిగా ఆడటం జట్టు విజయానికి బాటలు వేసింది. ఇంకా 10 బంతులు మిగిలివుండగానే సన్ రైజర్స్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగింది. ఇప్పటివరకు ఆడన 12 మ్యాచ్ లల్లో అయిదింట్లో గెలిచింది. ఏడింట్లో పరాజయాన్ని చవి చూసింది.
లక్నో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీన గుజరాత్ టైటాన్స్, 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లు ఆడనుంది. ఈ రెండింట్లో గెలిచినా కూడా లక్నోకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. పైగా లక్నో ఎదుర్కొనబోయే ఆ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్నాయి కూడా.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications