మా కావ్య పాపను ఏడిపించారు కదరా..మీరేం బాగుపడతారు..!

కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.

కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Sunrisers Hyderabad have no chance of reaching the playoffs after consecutive losses

ఇక ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పేలవంగా ఆడుతోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీం, అందులో ఒక దానిలో మాత్రమే విజయం సాధించింది. నాలుగు వరుస పరాజయాలతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌ విన్నర్ అవుతుందని భావించిన సన్‌రైజర్స్ ఇలా వరుసగా ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ పూర్తి నిరాశలో మునిగిపోయారు.

Take a Poll

వాస్తవానికి గతంలో ఎప్పుడు లేనంత క్రేజ్ సన్‌రైజర్స్ టీంకు వచ్చింది. చాలామంది అభిమానులు సన్‌రైజర్స్ టీంకు మద్దతుగా నిలిచారు. కానీ సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యారు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్ అన్ని విభాగాల్లో హైదరాబాద్ ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. కావ్య మారన్ కోట్లు కుమ్మరించి కొనుగొలు చేసిన ఆటగాళ్లు సైతం అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ కథ దాదాపు ముగిసినట్టే. ఏదో అద్భుతం జరిగితే తప్ప సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్ చేరే అవకాశం కనిపించడం లేదు. మొత్తానికి ఈ సీజన్ కావ్య మారన్‌ జట్టు అనుకున్నంత విజయాలను నమోదు చేయలేకపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+