హీట్ పెంచిన సన్‌రైజర్స్: సింగిల్ బెర్త్.. 5 టీమ్స్: ఏ జట్టు ఛాన్సులు ఎలా?
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు చివరికొచ్చింది. సోమవారం రాత్రి చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను అయిదు వికెట్ల తేడాతో ఓడించి ఈ రేసును మరింత వేడెక్కించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ తర ప్లేఆఫ్ బెర్త్ ను పదిలం చేసుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్ కు చేరుకున్నాయి కూడా.
ఆదివారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించిన ఆర్సీబీ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో మొత్తం మూడు జట్లు, సన్ రైజర్స్, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యాయి. చివరి ఒకే ఒక స్థానం కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇంకా ఏడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఈ ప్లేఆఫ్ అర్హత రేసు మరింత రసవత్తరంగా మారనుంది.

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ సమీకరణాలు
పంజాబ్ కింగ్స్ పరిస్థితి క్లిష్టం. చివరి లీగ్ మ్యాచ్ గెలిచి 15 పాయింట్లు సాధించినా, రాజస్థాన్, కోల్‌కతా దీన్ని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. 13 పాయింట్లతో అర్హత సాధించాలంటే.. రాజస్థాన్, ఢిల్లీ, చెన్నై తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి. కోల్ కత ఢిల్లీపై గెలిచి, ముంబై చేతిలో ఓడిపోవాలి. అప్పుడు కేకేఆర్, పంజాబ్ రెండూ 13 పాయింట్లతో సమానంగా నిలిచి, నెట్ రన్ రేట్ ద్వారా అర్హత నిర్ణయిస్తాయి.
రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్
రాజస్థాన్ రాయల్స్ తన చివరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. తమ భవితవ్యం తమ చేతుల్లోనే ఉన్న ఏకైక జట్టు ఇది. ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడిపోతే.. క్వాలిఫై సంక్లిష్టంగా మారుతుంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ పాయింట్ల పరంగా ఆర్ఆర్ ను అధిగమించే అవకాశం ఉంది. ఢిల్లీ, చెన్నై కూడా 14 పాయింట్లతో వారిని సమం చేసి నెట్ రన్ రేట్‌ను తెరపైకి తీసుకురావచ్చు. రెండు మ్యాచ్‌లలో ఓడిపోతే 12 పాయింట్లతో పోటీ నుంచి నిష్క్రమిస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు..
చెన్నై సూపర్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్ గెలిచినా నేరుగా ప్లేఆఫ్స్ అర్హత సాధించలేదు. రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా జట్లు అడ్డంకిగా మారుతాయి. ఢిల్లీ కూడా 14 పాయింట్లతో చెన్నైకి సమానంగా నిలిస్తే నెట్ రన్ రేట్ లెక్కలను తెరపైకి వస్తాయి. చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే పోటీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఛాన్సెస్..
ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో చెన్నూై సూపర్ కింగ్స్ కు సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ లో తేడా ఉంది. డీసీ ఎన్ఆర్ఆర్ -0.871 కాగా, సీఎస్కేది -0.016. దీంతో నెట్ రన్ రేట్ ఆధారంగా చెన్నై ముందంజలో ఉన్నట్టే. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చివరి లీగ్ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది ఢిల్లీకి. ఓటమి పాలైతే నిష్క్రమిస్తుందీ జట్టు.
కోల్‌కతా నైట్ రైడర్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ తన చివరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే 15 పాయింట్లు సాధిస్తుంది. అయినా కూడా ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్లపై ఆధారపడక తప్పదు. రాజస్థాన్ 16 పాయింట్లు సాధించవచ్చు. పంజాబ్ కూడా 15 పాయింట్లతో పోటీకి రావొచ్చు. 13 పాయింట్లతో అర్హత సాధించాలంటే, పంజాబ్, రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడు కేకేఆర్, పంజాబ్ కింగ్స్ రెండూ 13 పాయింట్లు సాధిస్తాయి. ఈ దశలో నెట్ రన్ రేట్ కీలకమౌతుంది. రెండు మ్యాచ్‌లలోనూ కేకేఆర్ ఓడిపోతే పోటీ నుంచి నిష్క్రమిస్తుంది.












Click it and Unblock the Notifications