అయ్యా అయ్యా .. ఒక్క మ్యాచ్ అయినా గెలవండయ్యా ప్లీజ్..!

పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పరిస్థితి. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ టీం చూసిన వారంతా , ఈ ఏడాది కచ్చింతంగా ఐపీఎల్ విన్నర్ హైదరాబాదే అని అనుకున్నారు.ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలామంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది.తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది.

ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.ప్రత్యర్థి ముందు 191 పరుగుల టఫ్ టార్గెట్ చేసినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సొంత గ్రౌండ్‌లో సన్ రైజర్స్ ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ టీం ఓడిపోయింది. హెడ్, అభిషేక్ శర్మ నుంచి ఇప్పటి వరకు సరైన ఇన్నింగ్స్ రాలేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. మరోవైపు తెలుగోడు అయిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిల్యూర్స్ కూడా జట్టుకు ఇబ్బందికరంగా మారింది.

Sunrisers Hyderabad will face Gujarat Titans

Take a Poll

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి స్లో బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆడన రెండు మ్యాచ్‌ల్లో నితీష్ కుమార్ రెడ్డి ఫ్లాప్ అయ్యాడు.హెన్రీచ్ క్లాసెన్ కూడా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. పెసర్లు రాణించాల్సి ఉంది.విజయంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున 2 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. ఇటువంటి నేపథ్యంలో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. తొలి ఓటమి తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్-5లో నిలిచింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానంలో అద్భుతంగా ప్రదర్శన ఇవ్వడం ద్వారా ట్రాక్‌లోకి తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ విజయం సాధిస్తేనే రేసులో నిలబడుతుంది.ఇటువంటి తరుణంలో సన్‌రైజర్స్ జట్టు విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+