హార్దిక్ పాండ్యాకు షాకిచ్చిన గంభీర్..టీమిండియా కొత్త కెప్టెన్ అతడే..?
టీ20 వరల్డ్ కప్-2024 గెలుపు సంబరాలు ముగిశాయి. మెగా ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు విక్టరీ పరేడ్‌లో ఘనంగా సత్కరించారు. టీమిండియాకు తదుపరి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. పొట్టి కప్పు ముగిసిన కొద్ది రోజులకే జింబాబ్వేతో 5 టీ20లు ఆడింది భారత్. ఇంకొన్ని రోజుల్లో శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది మెన్ ఇన్ బ్లూ. వరుస విజయాలు అందుకోవడం, సీనియర్లు-జూనియర్లతో కూడిన టీమ్ బలంగా ఉండటంతో టీమిండియాకు ఢోకా లేదని అంతా అంటున్నారు.
అయితే పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. భారత క్రికెట్‌కు కాబోయే కెప్టెన్ ఎవరనే ప్రశ్న అందర్ని ఇబ్బంది పెడుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. వచ్చే ఏడాది 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఈ టోర్ని అనంతరం రోహిత్ శర్మ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. ఇటువంటి సమయంలో జట్టును ముందుండి నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఈక్రమంలో అందరు టీ20 వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాకు పొట్టి ఫార్మాట్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. యాజమాన్యం కూడా తొలుత హార్దిక్ వైపే మొగ్గు చూపింది. అయితే కోచ్‌గా గంభీర్ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. టీ20 పగ్గాలు హార్దిక్ పాండ్యా కాకుండా పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వాలని గంభీర్ బీసీసీఐకి సూచించినట్టు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా నిత్యం గాయాలతో జట్టుకు దూరం అవుతుంటాడని, దీని ప్రభావం మ్యాచ్‌ల మీద పడుతుందని అందుకే హార్దిక్ పాండ్యా కన్నా సూర్యకుమార్ యాదవ్ అయితే బెస్ట్ ఆప్షన్ అని కోచ్ గంభీర్ బీసీసీఐకి సూచించారట. తాజాగా ఇదే విషయాన్ని పీటీఐ సైతం ధృవికరించింది.2026 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందని తెలిపింది. కెప్టెన్ విషయంలో హార్దిక్ పాండ్యాతో గంభీర్ చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ తెలిపింది. దీంతో టీ20లకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ పేరు దాదాపు ఖాయమైనట్టే.












Click it and Unblock the Notifications