Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2026: భారత్ లో మ్యాచ్ లపై తేల్చేసిన బంగ్లాదేశ్..! ఐసీసీకి క్లారిటీ ..!

భారత్,శ్రీలంక ఉమ్మడిగా ఆతిధ్యమిస్తున్న టీ20 పురుషుల వరల్డ్ కప్ వచ్చే నెల 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకూ దాదాపు నెల రోజుల పాటు జరగబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మెగా టోర్నీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో హిందువుల ఊచకోతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఐపీఎల్ క్రికెటర్ ముస్తాఫిజుర్ ను బాయ్ కాట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది.

బంగ్లాదేశ్ జాతీయ జట్టులో ప్రధాన బౌలర్ అయిన ముస్తాఫిజుర్ ను అవమానకరంగా ఐపీఎల్ నుంచి తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను బహిష్కరించడంతో పాటు తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను సైతం నిషేధించింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగింది. భారత్ లో ఆడబోమన్న బంగ్లాదేశ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, కేవలం నెల రోజుల వ్యవధిలో వేదికలు మార్చడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా జరిగిన ఐసీసీ భేటీలో స్పందించింది.

T20 World Cup 2026 Bangladesh Sticks to India Boycott Confirms to ICC

గతంలో నిర్ణయించిన విధంగా భారత్ లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోమన్న వైఖరికే కట్టుబడి ఉన్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తేల్చిచెప్పేసింది. ఈ మేరకు తాజాగా ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో బీసీబీ అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. చర్చల సందర్భంగా తమ క్రికెటర్లకు భద్రతా సమస్యలను కారణంగా చూపుతూ ఈ మెగా టోర్నీలో ఆడేందుకు భారతదేశానికి వెళ్లకూడదనే తన నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారతదేశం వెలుపల ఉన్న వేదికలకు మార్చడాన్ని పరిగణించాలని బోర్డు మరోసారి ఐసీసీని కోరింది.

T20 World Cup 2026 Bangladesh Sticks to India Boycott Confirms to ICC

అయితే టోర్నమెంట్ షెడ్యూల్, ప్రయాణ ప్రణాళిక ఇప్పటికే ఖరారు చేసినట్లు ఐసీసీ తెలిపింది. అలాగే బీసీబీ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాలని కోరింది. అయినా బీసీబీ మాత్రం ఆటగాళ్లు, అధికారులు, సహాయక సిబ్బంది భద్రత, శ్రేయస్సు తమకు ప్రధానమని తెలిపింది. చివరిగా ఐసీసీ, బీసీబీ ఇద్దరూ ఈ వ్యవహారంపై చర్చల్ని కొనసాగించాలని నిర్ణయించాయి. బీసీసీఐ, బీసీబీ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+