రవిచంద్రన్ అశ్విన్‌కు రీప్లేస్: టీమిండియాలో కోటిగాడు

Ravichandran Ashwin replacement: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 26వ తేదీన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. బాక్సింగ్ డే టెస్ట్ ఇది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక. ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు ముమ్మరంగా కసరత్తు సాగిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్నాయి.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. 1-1తో సమంగా నిలిచాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ గెలవాలన్నా, డ్రాగా ముగించుకోవాలనుకున్నా బాక్సింగ్ డే గేమ్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో దీన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి రెండు జట్లు.

Tanush Kotian has been picked as Ravichandran Ashwin s replacement

ఈ పరిస్థితుల్లో సిరీస్ మధ్యలోనే టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా రెండు టెస్టులు మిగిలివుండగానే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా నుంచి ఇంటికీ వచ్చేశాడు.

ఈ క్రమంలో అతనికి రీప్లేస్‌మెంట్‌ను తీసుకోవాల్సి వచ్చింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు. రవి అశ్విన్ స్థానంలో యంగ్ ప్లేయర్ తనూష్ కోటియాన్‌కు చోటు కల్పించింది. బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న నేపథ్యంలో ఈ సాయంత్రం అతను మెల్‌బోర్న్‌కు బయలుదేరి వెళ్లనున్నాడు. బాక్సిండ్ డే టెస్ట్ నాటికి జట్టుకు అందుబాటులో రానున్నాడు.

26 సంవత్సరాల ముంబైకి చెందిన రైట్ ఆర్మ్ ఆఫ్- బ్రేక బౌలర్ తనూష్ కోటియాన్. రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరుంది. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై తరఫున మ్యాచ్‌లను ఆడుతున్నాడు.

ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను ఆడిన కోటియన్ 101 వికెట్లు పడగొట్టాడు. అతని కేరీర్ బౌలింగ్ యావరేజ్ 25.70. 47 ఇన్నింగ్‌లల్లో 1,525 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లడానికి ముందు ఆ దేశంలో పర్యటించిన ఇండియా ఏ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. 44 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+