మరోసారి తండ్రైన అంబటి రాయుడు.. ఇలాగే దూసుకెళ్ళు అంటూ కామెంట్స్
టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఎమోషనల్ అయ్యారు. తన చిరకాల వాంఛ నెరవేరి వేళ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగానే అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు.
టీమిండియా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు తీపి కబురు చెప్పాడు. అంబటి రాయుడు తాజాగా మరోసారి తండ్రైన వేళ... నేడు ఆయన భార్య విద్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. హస్పటల్ లో తన భార్య, తన కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాయుడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు, అంబటి రాయుడుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇలాగే ముందుకు దూసుకు వెళ్ళు రాయుడు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో అంబటి రాయుడు తండ్రైన న్యూస్ వైరల్ గా మారింది.
అంబటి తిరుపతి రాయుడు. 1985సెప్టెంబర్ 23న గుంటూరు జిల్లాలో జన్మించారు. తండ్రి అంబటి శాంబశివరావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. చిన్న వయస్సు నుంచే రాయుడిని క్రికెట్ వైపు ప్రోత్సహించి, అతని కెరీర్‌కు బలమైన మద్దతు అందించారు. ఫిబ్రవరి 14, 2009 (వాలెంటైన్స్ డే) న రాయుడికి చెన్నుపల్లి విద్యతో వివాహం జరిగింది. అంబటి రాయుడు దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 12 జూలై 2020 పెద్ద కుమార్తె వివియా (Viviya) జన్మించగా.. 2023లో చిన్న కుమార్తె జన్మించింది.

క్రికెట్ లో టీమిండియా తరుఫున, ఐపీఎల్ లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ తరఫున బాగా రాణించిన రాయుడు .. రాజకీయాల్లో మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. ఏపీలో వైసీపీ తరఫున రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ బరిలో నిలిచేందుకు కూడా సిద్ధమయ్యారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్త్రతంగా పర్యటించారు. ఈ క్రమంలోనే అతనికి స్థానికత బాగా కలిసివచ్చింది. సామాజిక బలం కూడా తొడైంది.
అనంతరం అన్యూహ్యాంగా మరో వ్యక్తి పేరును గుంటూరు ఎంపీ స్థానానికి నిలిపేందుకు వైసీపీ ప్రయత్నించడంతో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి గుడ్ బాయ్ చెప్పేశారు. అనంతరం జనసేన లో చేరారు.ప్రస్తుతం కామెంటర్ గా మాత్రమే వ్యవహరిస్తున్న రాయుడు.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications